భారత్ × ఆస్ట్రేలియా: షెడ్యూల్ విడుదల
- April 30, 2018
మెల్‌బోర్న్: ఈ ఏడాది కోహ్లీసేన వరుసగా టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లతో బిజీగా గడపనుంది. ఐపీఎల్ అనంతరం టీమిండియా వన్డే, టీ20, టెస్టు సిరీస్‌లు ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లనున్న విషయం తెలిసిందే. జులైలో ఈ పర్యటన ప్రారంభం కానుంది. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా 2018-19కి సంబంధించి ఆసీస్ ఆడే క్రికెట్ మ్యాచ్‌ల వివరాలను వెల్లడించింది. 2018 నవంబరు 21 నుంచి 2019 జనవరి 18 వరకు భారత్-ఆసీస్ మధ్య టీ20, టెస్టు, వన్డే సిరీస్‌లు జరగనున్నట్లు పేర్కొంది. ఈ పర్యటనలో భారత్ ఆతిథ్య ఆసీస్‌తో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. పర్యటనలో టీ20 సిరీస్‌తో భారత్ తన పర్యటనను ప్రారంభించనుంది.
షెడ్యూల్:
మొదటి టీ20: నవంబరు 21- గబ్బా
రెండో టీ20: నవంబరు 23- మెల్‌బోర్న్
మూడో టీ20: నవంబరు 25- సిడ్నీ
మొదటి టెస్టు: డిసెంబరు 6 - ఆడిలైట్
రెండో టెస్టు: డిసెంబరు 14 - పెర్త్
మూడో టెస్టు: డిసెంబరు 26 - మెల్‌బోర్న్(బాక్సింగ్ డే టెస్టు)
నాలుగో టెస్టు: జనవరి 3- సిడ్నీ
మొదటి వన్డే: జనవరి 12- సిడ్నీ
రెండో వన్డే: జనవరి 15- ఆడిలైట్
మూడో వన్డే: జనవరి 18- మెల్‌బోర్న్
ఈ మూడు సిరీస్‌ల్లో ఆసీస్ ఆటగాళ్లు స్మిత్, వార్నర్ ఆడలేరు. బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా వీరిద్దరిపై విధించిన 12 నెలల నిషేధం 2019 మార్చిలో ముగియనుంది. దీంతో వీరు ఈ సిరీస్‌కు దూరం కానున్నారు. ఇదే వివాదంలో 9 నెలల నిషేధం ఎదుర్కొంటున్న బాన్‌క్రాఫ్ట్ భారత్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నాడు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







