రాజకీయాల్లోకి ప్రముఖ నటి సంగీత .!
- May 01, 2018
సినీ తారలు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. గతంలో ఎన్టీఆర్, కృష్ణ, జమున, చిరంజీవి, కృష్ణంరాజు, పవన్ కల్యాణ్ లాంటి హీరోలు రాజకీయాల్లోకి రాణించారు కూడా. తాజాగా అలనాటి ప్రముఖ నటి సంగీత రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముత్యాల ముగ్గు చిత్రంతో సినీ తెరకు పరిచయమై అనేక ప్రజాదరణ పొందిన చిత్రాల్లో నటించారు. చాలా ఏళ్లుగా చెన్నైలో ఉంటున్న సంగీత ఇటీవల హైదరాబాద్‌కు మకాం మార్చారు.
ఇటీవల ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూలో సంగీత మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావాలనుకొంటున్నది నిజమే. కానీ స్వచ్ఛంద సేవ కోసమే పాలిటిక్స్‌లోకి రావాలనుకొంటున్నాను. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును మర్యాదపూర్వకంగ కలిశాను. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని అన్నారు. పదవుల కోసం రాజకీయాల్లోకి చేరడం లేదు. కానీ నృత్య, సాంస్కృతిక రంగాలకు సేవ చేయాలనుకొంటున్నాను అని ఆమె తెలిపారు.
నటి సంగీత వరంగల్‌కు చెందిన వారు. తెలుగు సినిమాలో తొలిచిత్రంతోనే రాష్ట్రపతి అవార్డును అందుకొన్నారు. ముత్యాల ముగ్గులో ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించారు. శివాజీ గణేషన్, రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి లాంటి నటులతో నటించారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!