వాట్సాప్ లో కొత్త ఫీచర్లు : అడ్మిన్ చేతికి కొత్త అధికారం..!
- May 01, 2018
వాట్సాప్ గ్రూపులో ఎవరిదైనా పుట్టినరోజు వచ్చిందంటే చాలు గ్రూపు పేరు మార్చెస్తుంటారు. అప్పటి వరకు ఉన్న ఐకాన్‌లో కూడా మార్పులు చేస్తుంటారు. అయితే, అందరికీ ఇది నచ్చకపోవచ్చు. ఉదయం లేచేసరికి గ్రూపు మొత్తం ఇలా మారిపోవడం చూసి ఇదేదో కొత్త గ్రూపు అని పొరపడేవారు చాలామందే ఉంటారు. కొందరు సభ్యులైతే ఎప్పటికప్పుడు గ్రూపు పేరు మారుస్తూ ఇతరులకు చికాకు కలిగిస్తుంటారు. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ కొత్త సదుపాయాన్ని వాట్సాప్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ మేరకు సదరు గ్రూప్ అడ్మిన్‌కు కొత్త అధికారాలను అప్పగిస్తోంది. ప్రస్తుతం ఇది బీటా దశలో ఉంది. త్వరలో యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.
ఈ కొత్త సదుపాయం ద్వారా గ్రూప్ అడ్మిన్.. గ్రూపు పేర్లు, ఐకాన్, గ్రూప్‌నకు సంబంధించిన వివరాలు ఇతర సభ్యులు మార్చకుండా చేయొచ్చు. ఇందుకోసం గ్రూప్ ఇన్ఫో> గ్రూప్ సెట్టింగ్స్> ఎడిట్ గ్రూప్ ఇన్ఫోను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్, ఐకాన్, డిస్ర్కిప్షన్ మార్చే అధికారం అందరికీ ఉండాలా? లేక అడ్మిన్‌కు మాత్రమే ఉండాలా? అనేది ఎంచుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడే కొత్త అడ్మిన్‌లను ఎంపిక చేసే సదుపాయాన్ని వాట్సాప్ అందిస్తోంది.
దీంతో పాటు గ్రూపునకు సంబంధించి మరికొన్ని సదుపాయాలను కూడా వాట్సాప్ త్వరలో తీసుకురాబోతోంది. గ్రూపులో సభ్యులు ఎవరూ కూడా టెక్ట్స్, ఆడియో, ఇమేజ్, వీడియో, డాక్యుమెంట్లను అడ్మిన్ అనుమతి లేకుండా పోస్ట్ చేసేందుకు వీలులేకుండా చేయనుంది.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్‌ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్‌లు
- బీచ్‌లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి