Interview with cardiac expertise Dr.Madhu Chittarvu
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
డా|| మధు చిత్తర్వు గారితో ముఖాముఖి

డా|| మధు చిత్తర్వు గారితో ముఖాముఖి

 

1) ప్రశ్న  . గుండె ఆరోగ్యానికి  చెయ్యవలసిన పనులు ఏమిటి ?

జవాబు :

1)తక్కువ కార్బోహైడ్రేట్లు , ఎక్కువ ప్రోటీన్స్ , తక్కువ నూనెలు.

2) వారానికి  కనీసం 5 రోజులు రోజుకు ఒక అరగంట చొప్పున నడక , లిఫ్ట్ ఎక్కడం మానడం , ఎక్కువ సేపు కూర్చోకుండా ఉండడం.

3) ధూమ  పానం మానడం.

4) బరువు  కంట్రోల్ లో ఉంచుకోవడం.

5) బి  పి.  షుగరు  కంట్రోల్ లో ఉంచుకోవడం.

 

2) ప్రశ్న :  ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి కూడా ఒక్కోసారి హార్ట్ ఎటాక్ కి గురి అవుతున్నాడు . ఇది ఆశ్చర్యం కదా ! దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ?

జవాబు : దీనినే సైలెంట్ ఎటాక్ అంటారు . అందుకే 30 సంవత్సరాలు దాటినా ప్రతీ వ్యక్తీ హెల్త్ చెక్ అప్  చేయించుకోవాలి .

 

3) ప్రశ్న  : గుండె పోటు వంశ పారం పర్యమా ?

జవాబు : అవును

 

4) ప్రశ్న : గుండె పై ఒత్తిడి ఎలా వస్తుంది ఒత్తిడి తగ్గించుకోవడం ఎలా ? (స్ట్రెస్)

జవాబు : జీవితం పట్ల మీ వైఖరి మారాలి . ఏదీ పూర్తి పర్ఫెక్ట్ గా ఉండక పోవచ్చు అనేది గుర్తుంచుకోవాలి.

 

5) ప్రశ్న: ఆరోగ్య వంత మైన గుండె కోసం జాగ్గింగ్ , నడక రెండింటిలో ఏది ఉత్తమం ?

జవాబు : నడక మంచిది . జాగ్గింగ్ లో జాయింట్స్ మీద ఒత్తిడి పెరిగి ప్రమాదం జరగవచ్చు.

 

6) ప్రశ్న : లో బ్లడ్ ప్రెషర్ వారికి గుండె పోటూ వచ్చే అవకాశం ఉందా ?

జవాబు : చాలా తక్కువ.

 

7) ప్రశ్న  : అకాల భోజనాలు గుండె మీద ప్రభావం చూపిస్తాయా ?

జవాబు : మీరు అకాల భోజనాలు చెయ్యడం వలన జంక్ ఫుడ్ తింటారు .  ఆ ఆహారం జీర్ణం కావడానికి ఊరవలసిన ఎంజైములు  కన్ఫ్యూజ్  అవుతాయి .

 

8) ప్రశ్న : మందులు వాడకుండా కొలెస్టరాల్  కంట్రోల్ చెయ్యడం ఎలా ?

జవాబు : ఆహార నియంత్రణ , నడక , వాల్ నట్స్ తినడం ద్వారా కొలెస్టరాల్  కంట్రోల్ చేయవచ్చు.

 

9) ప్రశ్న : గుండె  ఆరోగ్యానికి మంచి ఆహారం ఏది ?  చెడ్డ ఆహారం ఏది ?

జవాబు : పళ్ళు , కాయగూరలూ మంచివి . నూనెలు చెడ్డవి.

 

10) ప్రశ్న : ఏమేమి టెస్టులు చేయించుకోవాలి ? ఏదైనా ప్రత్యెక టెస్ట్ ఉందా ?

జవాబు : రొటీన్ షుగర్ , బి . పి , కొలెస్టరాల్ చాలు . ఎకో టెస్ట్ చేయించుకుని ట్రెడ్ మిల్ చేయించుకోండి.

.

11) ప్రశ్న : గుండె పోటు వచ్చిన వారికి చెయ్యవలసిన తక్షణ సహాయం ఏమిటి ?

జవాబు : గుండె పోటు వచ్చిన వ్యక్తిని పడుకోబెట్టండి .  ఒక ఆస్ప్రిన్  మాత్ర నాలుక కింద పెట్టండి . సోర్బిట్రేట్ మాత్ర అందుబాటులో ఉంటె అది కూడా పెట్టండి . వీలయినంత త్వరగా గుండె వ్యాధి నిపుణుడి  దగ్గరకి  తీసుకు వెళ్ళండి . మొదటి గంట లోపులోనే  మరణం సంభవించే అవకాశాలు ఎక్కువ .

 

12) ప్రశ్న :  గేస్త్రిక్ నొప్పికీ - గుండె నొప్పికీ తేడా తెలుసుకోవడం ఎలా ?

జవాబు : ఈ సి జీ చూస్తే గానీ  చెప్పలేము.

 

13) ప్రశ్న : యువకులలో  గుండె వ్యాధులూ , హార్ట్ ఎటాక్ లు పెరిగి పోవడానికి కారణం ఏమిటి ? ( 30 - 40 మధ్య యువతలో హార్ట్ ఎటాక్ లు , గుండె వ్యాధులూ ఈ మధ్య ఎక్కువ అయ్యాయి )

జవాబు : యువతలో అవేర్నెస్ పెరిగింది . అందు వలన కేసులు కనిపిస్తున్నాయి . జీవన విధానం ( బద్ధకం ) , జంక్ ఫుడ్ , వ్యాయామం లేక పోవడం , పొగ తాగడం . మన దేశం లో జెనేటికల్ గా  అమెరికా , యూరోప్ దేశాలతో పోలిస్తే గుండెపోటు అవకాశాలు 3 రెట్లు ఎక్కువ .

.

14) ప్రశ్న : బి. పి 120 /80 కంటే ఎక్కువ గా ఉండి పూర్తి ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు ఉంటారా ?

జవాబు : ఉంటారు.

 

15) ప్రశ్న:  ఎన్టీ హైపర్ టేన్సివ్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ? ( దీర్ఘ కాలం లో కానీ / స్వల్పకాలం లో కానీ )

జవాబు : చాలా మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి . ఇప్పుడు వస్తున్న కొన్ని మందులు చాలా వరకూ సేఫ్.

 

16) ప్రశ్న  : కాఫీ / టీ ఎక్కువ తాగడం వలన గుండెకు ఏమైనా ప్రమాదం ఉందా ?

జవాబు : లేదు అది కేవలం అపోహ మాత్రమే.

 

17) ప్రశ్న  : మీ దృష్టిలో జంక్ ఫుడ్ అంటే ఏమిటి ?

జవాబు : వేపుళ్ళు  ఉదాహరణ కెంటకీ , మెక్ డొనాల్డ్స్ , సమోసాలు , మసాలా  దోశలు కూడా.

 

18) ప్రశ్న: భారతీయులు గుండె జబ్బులకు గురి అయ్యే అవకాశం 3 రెట్లు ఎక్కువ అమెరికా , యూరోపు వారితో పోల్చితే అన్నారు . వాళ్ళు కూడా జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు కదా !

జవాబు : ప్రతీ జాతీ కొన్ని జబ్బులకు గురిఅవుతూ ఉంటుంది  ( అనుకూలత ఉంటుంది )  దురదృష్ట వశాత్తూ భారతీయులు ఖరీదైన గుండె జబ్బులకు గురి కావడం జరుగుతున్నది .

 

19) ప్రశ్న : లో  వైట్  బ్లడ్ సెల్స్ ( తక్కువ తెల్ల రక్త కణాలు ) హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం గుండె జబ్బులకు కారణాలు అవుతాయా ?

జవాబు : కావు . కానీ నార్మల్  హిమోగ్లోబిన్ వలన మీరు ఎక్సేర్సైజ్  చేసే కెపాసిటీ పెరుగుతుంది.

 

20) ప్రశ్న  : షుగరుకూ , గుండె జబ్బులకూ సంబధం ఉందా ?

జవాబు : ఉంది . షుగర్ పేషెంట్ కి గుండె జబ్బులు వచ్చే అవకాశం మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ .

 

21) ప్రశ్న :  గుండె ఆపరేషన్ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ?

జవాబు : ఆహారం , ఎక్సేర్సైజ్ , మందులు సకాలం లో వేసుకోవడం , కొలెస్టరాల్  , బరువు ,  బి పీ లను కంట్రోల్ లో ఉంచుకోవడం.

.

22) ప్రశ్న : ఆడవాళ్ళల్లో కంటే మగవాళ్ళల్లో గుండె జబ్బుల రేటు ఎక్కువ ఎందువలనా ?

జవాబు : ప్రకృతి ఆడ వాళ్ళను 45 సంవత్సరాల వరకూ రక్షిస్తూ ఉంటుంది ( ఇప్పడు వెలువడిన గణాంకాల ప్రకారం ఆడవాళ్ళల్లో ప్రస్తుతం ఈ రేటు మగవాళ్ళల్లో కన్నా ఎక్కువగా ఉంది.

 

ఆఖరు ప్రశ్న :

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా ?

జవాబు :

ఆరోగ్య వంత మైన ఆహారం తినండి

ప్రతి రోజూ ఎక్సేర్సైజ్ చెయ్యండి

జంక్ ఫుడ్ తినకండి

స్మోకింగ్ మానండి

30 సంవత్సరాల తర్వాత ప్రతీ ఆరు నెలలకూ హెల్త్ చెక్ అప్ చేయించుకోండి (రికమెండెడ్)