డ్రంక్ అండ్ డ్రైవ్‌లో లైసెన్సులు సస్పెండ్ ..

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో లైసెన్సులు సస్పెండ్ ..

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మీ తాగిన మందు రక్తంలో 100 ఎంఎల్ మించితే ఇక మీ లైసెన్సులు సస్పెండ్ అయ్యినట్లే....రెండ్ సిగ్నల్ జంప్ చేస్తే రెండో సారికే మీ డ్రైవింగ్ లైసన్స్‌లు సస్పెండ్ అవుతాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల నిరంతరంగా జరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చాలా మంది మందు బాబులు మత్తులోనే ప్రమాదకరంగా వాహనాలను నడుపుతూ దొరికిపోతున్నారు. అదే విధంగా ట్రాఫిక్ నిబంధనల విషయంలో కూడా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎదుటి వారిని ప్రమాదాల బారిన పడేస్తూ వారు కూడా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు జరగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రాంతాలను దాటుతూ చాలా మంది వాహనదారులు కొత్త రూట్లలో ప్రయాణిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని పసిగట్టిన ట్రాఫిక్ కాప్స్ ఇప్పుడు ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో 5 నుంచి 6 ప్రాంతాలను గుర్తించి ఆ ఏరియాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను విస్తృతం చేయనున్నారు.పదేపదే నిబంధనలను ఉల్లంఘిస్తే..ఇక డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహనదారుడి రక్తంలో వంద మిల్లీగ్రాముల మద్యం స్థాయి కనిపిస్తే అతని లైసెన్స్‌లను సస్పెండ్ చేస్తున్నారు. ఇదే కాకుండా డ్రైవ్‌లో రెండో సారి పట్టుబడితే కూడా లైసెన్స్‌లు తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. రెడ్ సిగ్నల్ ను మొదటిసారి జంప్ చేసి రెండోసారి జంప్ చేసి పట్టుబడినా అతని లైసెన్స్‌లను కూడా సస్పెండ్ చేస్తున్నారు. ఇలా ఇతర ట్రాఫిక్ నిబంధనలను పదే పదే ఉల్లంఘించే వారిపై కూడా ఈ యాక్షన్ అమలుకు కసరత్తు చేస్తున్నారు.ఓఆర్‌ఆర్‌పై డ్రైవ్ చేస్తే వాహనం సీజ్ఓఆర్‌ఆర్ పై జరిగిన భారీ రోడ్డు ప్రమాదాలపై జరిపిన అధ్యయానాల్లో చాలా యాక్సిడెంట్‌లు నిద్ర మత్తు, నిర్లక్ష్యం, రాంగ్ పార్కింగ్‌లతో పాటు తాగి నడపడం కూడా కారణమని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇకపై ఓఆర్‌ఆర్ ఎంట్రీ గేటుల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆ సమయంలో డ్రైవర్ మద్యం సేవించి ఉంటే ఆ వాహనాన్ని అక్కడే సీజ్ చేసి వాటిని ఓఆర్‌ఆర్‌పైకి అనుమతించేది లేదంటున్నారు.

Back to Top