ఉచితంగా 4,500 ల గుండె ఆపరేషన్ లు చేయించిన మహేశ్ బాబు
- March 18, 2025
అమరావతి: గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తోన్న విషయం తెలిసిందే. మహేశ్ బాబు ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే, ఈ సంఖ్య సోమవారంతో 4,500 దాటినట్లు ఆంధ్రా హాస్పిటల్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఘట్టమనేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. తమ అభిమాన హీరో చేస్తున్న సమాజ సేవ పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు మహేశ్ బాబు అర్ధాంగి నమ్రతా శిరోద్కర్ ఏపీలో మదర్స్ మిల్క్ బ్యాంక్‌తో పాటు బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాను అందించే కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించారు. మహేశ్ బాబు ఫౌండేషన్ పిల్లల హార్ట్ ఆపరేషన్లను కొనసాగిస్తుందని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్‌లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!
- యూఏఈలో భారీ వర్షాలు..పబ్లిక్ పార్కులు మూసివేత..!!







