దుబాయ్, అబుదాబిలోని కొన్ని ప్రాంతాలలో పొగమంచు..!!
- March 18, 2025
యూఏఈ: మంగళవారం తెల్లవారుజామున యూఏఈలోని కొన్ని ప్రాంతాలలో దగ్టమైన పొంగమంచు ఏర్పడింది.దీని కారణంగా వాహనదారులు పనికి వెళ్లేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దుబాయ్, అబుదాబి, అల్ ఐన్ ప్రాంతాలలో దట్టమైన పొగమంచు ఏర్పడిందని జాతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కోసం వాతావరణ శాఖ రెడ్, ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసింది. ఈ ప్రాంతాలలో లో విజిబిలిటీ ఉంటుందని నివాసితులను హెచ్చరించింది. వాహనదారులందరూ జాగ్రత్తగా ఉండాలని అబుదాబి పోలీసులు పిలుపునిచ్చారు. పొగమంచు కారణంగా లో విజిబిలిటీ ఉంటుందని, డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని షార్జా పోలీసులు కూడా కోరారు.
NCM ప్రకారం.. రోజంతా పరిస్థితులు తేలికగా ఉంటాయి. నైరుతి నుండి వాయువ్య దిశలకు తేలికపాటి నుండి మితమైన గాలులు వీస్తాయి. గాలులు గంటకు 10 నుండి 20 కి.మీ. వేగంతో, అప్పుడప్పుడు గంటకు 35 కి.మీ. వేగంతో చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. రాత్రి సమయాల్లో తీరప్రాంతాల్లో తేమ పెరుగుతుందని, ఈ వీకెండ్ వరకు తేమతో కూడిన పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. పర్వత ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 9°C కనిష్ట స్థాయికి పడిపోవచ్చని, అంతర్గత ప్రాంతాలలో గరిష్టంగా 33°C కి చేరుకుంటాయని తెలిపింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







