హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ లో టికెట్స్
- March 22, 2025
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో జరిగే రెండో మ్యాచ్ కోసం ఇరుజట్ల అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించాలని ఆశపడుతున్నారు. ఈ మ్యాచ్ టికెట్లను ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో విక్రయించగా నిమిషాల వ్యవధిలో అమ్ముడయ్యాయి. చాలా మంది అభిమానులు టికెట్లు దొరకక నిరాశకు గురయ్యారు. ఈ డిమాండ్ ను సొమ్ము చేసుకునేందుకు టికెట్లు దక్కించుకున్న కొంతమంది కేటుగాళ్లు వాటిని బ్లాక్ లో అమ్ముతున్నారు.
టికెట్ల కోసం ఉప్పల్ స్టేడియానికి వచ్చి వెళుతున్న వారికి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ఈనేపథ్యంలోనే శనివారం ఉప్పల్ మెట్రో వద్ద భరద్వాజ్ బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నాడని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ వెంటనే భదద్వాజ్ ను అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న నాలుగు టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. భరద్వాజ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బ్లాక్ లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







