మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- March 14, 2026
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని అనేక ప్రదేశాలలో మరిన్ని ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. అల్ ఖువైర్ స్క్వేర్ మరియు సీబ్ విలాయత్లోని గ్రీన్ వాక్వే లలో కొత్త ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు మస్కట్ .మునిసిపాలిటీ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం మరియు పర్యావరణ అనుకూల రవాణా వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు మునిసిపాలిటీ వెల్లడించింది.
2025లో ఒమన్ సుల్తానేట్లోని వివిధ గవర్నరేట్లలో 160 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్లను ఏర్పాటు చేశామని, 2026లో 200 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) తెలిపింది.
గ్రీన్ మొబిలిటీ వెబ్సైట్ ప్రకారం.. ఒమన్ సుల్తానేట్లో 2,200 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. 160 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో దోఫర్ గవర్నరేట్లో 12, నార్త్ అల్ బటినాలో 10, అల్ వుస్తాలో నాలుగు, అల్ ధకిలియాలో ఎనిమిది మరియు మస్కట్లో 49 ఉన్నాయి. 2027 నాటికి 350 ఛార్జింగ్ స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక ఉందని MTCIT తెలిపింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







