BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- March 14, 2026
ముంబై: ఇటీవలి కాలంలో ఐసీసీ టోర్నీల్లో భారత్ సాధించిన అద్భుత విజయాలను పురస్కరించుకుని బీసీసీఐ ఆదివారం ముంబైలో ‘నమన్’ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించనుంది. మార్చి 8న సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ గెలిచిన పురుషుల జట్టుతో పాటు, గత రెండేళ్లలో ఐదు వేర్వేరు ఐసీసీ టైటిళ్లను గెలిచిన భారత జట్లను ఈ వేదికపై ఘనంగా సన్మానించనున్నారు. 2025 వన్డే ప్రపంచకప్ గెలిచిన మహిళల జట్టు, ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలు కూడా ఈ గౌరవాన్ని అందుకోనున్నారు.
టెస్టు, వన్డే కెప్టెన్ గిల్‌కు పాలీ ఉమ్రిగర్ అవార్డును ఇవ్వనున్నారు. మహిళల్లో బెస్ట్ ఇంటర్నేషన్ క్రికెటర్ అవార్డును స్మృతీ మంధానాకు ఇవ్వనున్నారు. మాజీ క్రికెటర్లు రోజర్ బిన్నీ, రాహుల్ ద్రావిడ్‌కు .. కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డును అందజేయనున్నారు. ఇక బీసీసీఐ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డును మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అందుకోనున్నారు. 1983లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో రోజర్ బిన్నీ సభ్యుడిగా ఉన్నారు. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసుకున్నారు.
అయితే 2022 నుంచి 2025 వరకు రోజర్ బిన్నీ కోచ్, సెలెక్టర్, బీసీసీఐ అధ్యక్షుడిగా చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 24వేల రన్స్ చేసిన క్రికెటర్‌గా ద్రావిడ్‌కు గుర్తింపు ఉన్నది. 2024 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన సమయంలో భారత జట్టు కోచ్‌గా ద్రావిడ్ ఉన్నారు.బెస్ట్ వుమెన్ డొమెస్టిక్ క్రికెటర్ కేటగిరీలో జగన్మోహన్ దాల్మీయా అవార్డును ఇరా జాదవ్‌కు ఇవ్వనున్నారు. సీనియర్ డొమెస్టిక్ వన్డే ఫార్మాట్‌లో బెస్ట్ వుమెన్ క్రికెటర్ అవార్డు షఫాలీ వర్మను వరించనున్నది. బెస్ట్ ఆల్‌రౌండర్‌కు ఇచ్చే లాల్ అమర్‌నాథ్ అవార్డును ఆయుష్ మాత్రేకు ఇవ్వనున్నారు. రంజీల్లో బెస్ట ఆల్‌రౌండర్ అవార్డు విదర్భ ప్లేయర్ హర్ష్ దూబేకు వెళ్లనున్నది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







