నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు..
- March 25, 2025
అమరావతి: ఏపీలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. రెండు రోజులపాటు జరిగే కలెక్టర్ల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మెగా డీఎస్సీపై క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. 16,147 ఉద్యోగాలను భర్తీ చేస్తామని, జూన్ నెలలో పాఠశాలల ప్రారంభం నాటికి నియామకాలు పూర్తికావాలని కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు పేర్కొన్నారు.
మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టులను భర్తీ ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే 80శాతం ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పాఠశాల విద్యా శాఖ పరిధిలో 13,661 పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2024 ఖాళీలు ఉన్నాయి. అలాగే విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49, బాల నేరస్తులకు విద్యా బోధనకోసం 15 టీచర్ పోస్టులు ఉండనున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!