హైదరాబాద్-విజయవాడ హైవేపై వెళ్లే వాహనదారులకు గుడ్ న్యూస్..

- March 31, 2025 , by Maagulf
హైదరాబాద్-విజయవాడ హైవేపై వెళ్లే వాహనదారులకు గుడ్ న్యూస్..

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే, ఆ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ఊరట కల్పిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రహదారిపై ఉన్న టోల్ గేట్ల వద్ద టోల్ రుసుము తగ్గిస్తూ నిర్ణయించింది. మార్చి 31వ తేదీ అర్థరాత్రి తరువాత (ఏప్రిల్ 1) నుంచి తగ్గించిన టోల్ రుసుము అమల్లోకి రానున్నాయి.

హైదరాబాద్–విజయవాడ (65) జాతీయ రహదారిపై తెలంగాణలో చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు (నందిగామ) వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. వీటి వద్ద 2012 డిసెంబర్ నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. 2024 జూన్ 31వరకు ఆ సంస్థ టోల్ వసూళ్లు, రహదారి నిర్వహణను పర్యవేక్షించింది. గతేడాది జూలై 1 నుంచి టోల్ వసూళ్లను ఎన్ హెచ్ఏఐ ఏజెన్సీల ద్వారా చేపడుతోంది. గతంలో జీఎమ్మార్ సంస్థ ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి టోల్ రుసుములను పెంచుకునేందుకు ఒప్పందం ఉండేది. ప్రస్తుతం ఎన్ హెచ్ఏఐ టోల్ వసూళ్లను చేపడుతున్నందున టోల్ రుసుములను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గించిన టోల్ ధరలు 2026 మార్చి 31 వరకు అమల్లో ఉండనున్నాయి.

ధరలు తగ్గించిన తరువాత టోల్ రుసుములు ఇలా..
పంతంగి టోల్ ప్లాజా వద్ద..

  • కారు, జీపు, వ్యాన్, లైట్ మోటారు వాహనం : ఒకవైపు రూ.80, ఇరువైపులా రూ.115.
  • లైట్ కమర్షియల్ వాహనం, లైట్ గూడ్స్ వాహనం, మినీ బస్సు : ఒకవైపు రూ.125, ఇరువైపులా రూ.190.
  • బస్సు లేదా ట్రక్కు (రెండు యాక్సిల్) : ఒకవైపు రూ.265, ఇరువైపులా రూ.395
  • వాణిజ్య రవాణా వాహనాలు (త్రీ యాక్సిల్) : ఒకవైపు రూ.290, ఇరువైపులా రూ. 435.

కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద..

  • కారు, జీపు, వ్యాన్, లైట్ మోటారు వాహనం : ఒకవైపు రూ.120, ఇరువైపులా రూ.180.
  • లైట్ కమర్షియల్ వాహనం, లైట్ గూడ్స్ వాహనం, మినీ బస్సు : ఒకవైపు రూ.195, ఇరువైపులా రూ.295.
  • బస్సు లేదా ట్రక్కు (రెండు యాక్సిల్) : ఒకవైపు రూ.410, ఇరువైపులా రూ.615
  • వాణిజ్య రవాణా వాహనాలు (త్రీ యాక్సిల్) : ఒకవైపు రూ.450, ఇరువైపులా రూ. 675.

చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద..

  • కారు, జీపు, వ్యాన్, లైట్ మోటారు వాహనం : ఒకవైపు రూ.105, ఇరువైపులా రూ.155.
  • లైట్ కమర్షియల్ వాహనం, లైట్ గూడ్స్ వాహనం, మినీ బస్సు : ఒకవైపు రూ.165, ఇరువైపులా రూ.250.
  • బస్సు లేదా ట్రక్కు (రెండు యాక్సిల్) : ఒకవైపు రూ.350, ఇరువైపులా రూ.520
  • వాణిజ్య రవాణా వాహనాలు (త్రీ యాక్సిల్) : ఒకవైపు రూ.380, ఇరువైపులా రూ. 570.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com