కెనడా-ఒంటారియో తెలుగు ఫౌండేషన్ టొరంటోలో ఘనంగా ఉగాది వేడుకలు

- April 01, 2025 , by Maagulf
కెనడా-ఒంటారియో తెలుగు ఫౌండేషన్ టొరంటోలో ఘనంగా ఉగాది వేడుకలు

కెనడా ఒంటారియో తెలుగు ఫౌండేషన్ (OTF) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ వేడుకలు టొరంటో లోని JCR ఆడిటోరియం అజాక్స్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో సుమారు వెయ్యికి పైగా తెలుగు కమ్యూనిటీ బంధుమిత్ర పరివారం ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ ఉగాది వేడుకలు సమన్వయకర్తలు ప్రవీణ్ నీల, చంద్ర చల్లా ముఖ్య వ్యాఖ్యాతలుగా  ప్రారంభించగా  ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మహిళా సమన్వయకర్తలు- వరలక్ష్మి గంధం, ఝాన్సీ బదాపురి, గీత రెడ్డిచెర్ల, శ్రీదేవి నీల, శిరీష ఘట్టి, లావణ్య ఆలూరి, ఆకర్ష కస్తూరి  జ్యోతి ప్రజ్వలనతో ఉగాది ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు.అనంతరం కిషోర్  శర్మ గారిచే పంచాంగ  శ్రవణం నిర్వహించారు.తదుపరి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. 

ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రీజినల్ కౌన్సిల్ ఫర్ విట్బీ-స్టీవ్ యమాడ మరియు మలీహా షాహిద్ హాజరయ్యారు.ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ ప్రత్యేక సందేశంతో తెలుగు ప్రజలందరికి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.అయిదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంటారియో తెలుగు ఫౌండేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ. ఒంటారియో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో అద్భుత  కార్యక్రమాలు చేస్తున్న సంస్థని కొనియాడారు.

భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ను భవిష్యత్ తరాలకు అందించాలనే ఆశయంతో  ప్రవీణ్ నీల రచనా దర్శకత్వంలో,ప్రసాద్ ఘట్టి సాంకేతిక  నైపుణ్యంతో పిల్లలందరూ  ప్రదర్శించిన "*భక్త ప్రహ్లాద*" పౌరాణిక దృశ్యరూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకుల మన్ననలు పొందింది.  

ఈ వేడుకల నిర్వహణకు చేయూతసాయం  సమకూర్చిన-గెట్ హోమ్ రియాల్టీ (రఘు జూలూరి, రమేష్ గొల్లు, ఆనంద్ పేరిచర్ల), రామ్ జిన్నాల, సుష్మ వరదరాజన్, కల్పేష్ పటేల్, కృష్ణ కుమారి కోటేరు, జోయెల్ ప్రకాష్, పుష్పిందర్ గిల్, చంద్ర యార్లగడ్డ, రవికిరణ్ ఇప్పిలి, శాయంతన్ మహేషన్, డా" సౌజన్య కాసుల, మురళి కృష్ణ రాతేపల్లి,  అబ్దేల్ బెనుటాఫ్, భరత్ కుమార్ సత్తి, తెలుగు ఫుడ్స్, హైదరాబాద్ హౌస్, మధురం, ఇంద్రప్రస్థ  రెస్టారెంట్, రేడియో భాగస్వామి-మార్నింగ్ రాగ సభ్యులు సంకీర్తన, షాజన్ లను OTF సమన్వయకర్తలు కలిసి శాలువాలతో సత్కరించి ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మొమెంటోలను బహుకరించారు.

ఈ వేడుకల సందర్భంగా స్థానిక వర్తకులను ప్రోత్సహిస్తూ ఏర్పాటు చేసిన విక్రేత కేంద్రాలు కూడా ప్రేక్షకులను ఆకర్షించాయి.ఉగాది ఉత్సవాలను సాంస్కృతిక కార్యక్రమ సమన్వయకర్తలు ప్రవీణ్, వరలక్ష్మి, ఝాన్సీ ల సహకారంతో చంద్ర చల్లా మరియు దినేష్ అయిదు గంటల పాటు వ్యాఖ్యానం చేసి  ప్రేక్షకులను అలరించారు.

ఈ కార్యక్రమంలో కెనడా - ఒంటారియో తెలుగు ఫౌండేషన్ సమన్వయకర్తలు శ్రీని ఇజ్జాడ, ప్రసాద్ ఘట్టి, చంద్ర చల్లా, దీప-నవీన్ సూదిరెడ్డి, మురళి రెడ్డిచెర్ల, వరలక్ష్మి గంధం, మంజూష చేబ్రోలు, భరత్ వేంకటాద్రి, ఝాన్సీ బదాపురి, మహీధర్ ఆలూరి, కళ్యాణ్ కస్తూరి, ప్రవీణ్ నీల మరియు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. 

సమన్వయకర్తలు  ప్రవీణ్, చంద్ర కృతజ్ఞతా వందన సమర్పణతో ఒంటారియో తెలుగు ఫౌండేషన్  సభ్యులకు, దాతలకు, భాగస్వామ్యులకు మరియు ఆదరిస్తున్న వారందరికీ  ఒంటారియో తెలుగు ఫౌండేషన్ సంస్థ హృదయపూర్వక  కృతజ్ఞతలు తెలియజేసారు. అలాగే ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి ఈ స్వచ్చంద సంస్థ అభివృద్ధి కి సహకరించిన వాలంటీర్లు అందరికి  ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ ఉగాది వేడుకలను ఘనంగా ముగించారు.
 
ప్రవీణ్ నీల మాట్లాడుతూ టొరంటో లో చలి వాతావరణం లో కూడా వెయ్యికి పైగా తెలుగు వారు పాల్గొనడం శ్లాఘనీయమే అన్నారు.అయిదుగంటల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఉచితంగా రుచికరమైన తెలుగింటి భోజనం, ఉగాది పచ్చడి, తినుబండారాలు, తేనీరు ఏర్పాటు చేయడం జరిగింది.  

ఏ దేశ మేగినా, ఎందుకాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము అన్న విధంగా ఉగాది వేడుక కెనడా టొరంటో లో ఘనంగా నిర్వహింపబడినది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com