ఏప్రిల్ 22 నుండి కొత్త ట్రాఫిక్ చట్టం..ఈ 12 నేరాలలో అరెస్టులు..!!

- April 02, 2025 , by Maagulf
ఏప్రిల్ 22 నుండి కొత్త ట్రాఫిక్ చట్టం..ఈ 12 నేరాలలో అరెస్టులు..!!

కువైట్: 1976 నాటి చట్టం 67ను సవరించి.. కువైట్ లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారికి కఠినమైన జరిమానాలను విధించనున్నారు. 2025 నాటి చట్టం 5ను ఏప్రిల్ 22 నుండి అమల్లోకి తీసుకువస్తామని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

మద్యం, మాదకద్రవ్యాలు లేదా సైకోట్రోపిక్ పదార్థాల ప్రభావంతో మోటారు వాహనాన్ని నడపడం, ట్రాఫిక్ ప్రమాదానికి కారణం కావడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే పర్మిట్ లేకుండా ప్రజా రహదారులపై మోటారు వాహన రేసులో పాల్గొనడం, ఒక వ్యక్తి భద్రతకు హాని కలిగించే ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి పారిపోవడానికి ప్రయత్నించడం లేదా  పోలీసు అధికారుల ఆదేశాన్ని పాటించడంలో విఫలమవడం, గరిష్ట వేగ పరిమితిని గంటకు 50 కి.మీ కంటే ఎక్కువ దాటడం, అనధికార ప్రాంతాల్లో బగ్గీలను నడపడం, రెడ్ లైట్ ను జంప్ చేయడం, ఇతర ప్రయోజనాల కోసం వాహనాన్ని ఉపయోగించడం, అవసరమైన పర్మిట్ లేకుండా ప్రయాణీకులను రవాణా చేయడం, నిర్లక్ష్యంగా నడపడం, ప్రయాణీకులు లేదా ఇతరుల ప్రాణాలు, వారి ఆస్తికి నష్టం చేయడం,  చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, సస్పెండ్ చేయబడిన లేదా రద్దు చేయబడిన లైసెన్స్‌తో, జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన లైసెన్స్ ప్లేట్లు లేకుండా వాహనాన్ని నడపడం చేసిన పక్షంలో సదరు వాహన డ్రైవర్ పై కేసులు నమోదు చేయడంతోపాటు అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.

జరిమానాలకు సంబంధించి..

కొత్త చట్టం ప్రకారం.. రెడ్ లైట్ దాటితే KD 50 నుండి KD 150 కు ఫైన్ పెంచారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు KD 30 నుండి KD 150 కు పెంచారు. ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తుల కోసం పేర్కొన్న పార్కింగ్ స్థలాలను ఉపయోగించడం వల్ల గతంలో ఉన్న KD 10 కు బదులుగా KD 150 జరిమానా విధించనున్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడితే KD 5 నుండి KD 75 కు ఫైన్ ను పెంచారు. సీటు బెల్టు పెట్టుకోకపోతే జరిమానా 10 కువైట్ దినార్ల నుంచి 30 కువైట్ దినార్లకు పెంచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com