దుబాయ్ హాట్ ఎయిర్ బెలూన్ సంఘటన.. ఖండించిన పోలీసులు..!!

- April 06, 2025 , by Maagulf
దుబాయ్ హాట్ ఎయిర్ బెలూన్ సంఘటన.. ఖండించిన పోలీసులు..!!

యూఏఈ: గత నెలలో దుబాయ్‌లో జరిగిన హాట్ ఎయిర్ బెలూన్ సంఘటన కొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.  అయితే, మార్చి 23న జరిగిన ఈ సంఘటనలో మరణాలు సంభవించాయన్న సోషల్ మీడియా వైరల్ పోస్టులను దుబాయ్ పోలీసులు తోసిపుచ్చారు. వీకెండ్ లో పోస్ట్ చేసిన వీడియోలో ఒక రష్యన్ పర్యాటకురాలు,  ఆమె తల్లి బెలూన్ ఎక్కి ఎడారిపై ఎగురుతూ, ఆపై అదుపుతప్పి ల్యాండింగ్‌ అయినట్లు చూపించారు. కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ సంఘటనలో ఇద్దరు చనిపోయారని తెలిపాయి. అయితే, దీనిని పోలీసులు తోసిపుచ్చారు. "ఈ సంఘటన గురించి మీడియాలో ప్రసారమయ్యే కొన్ని నివేదికలు తప్పు అని, అవి తప్పుదారి పట్టించేవి." అని పేర్కొన్నారు.  సదరు ఘటనలో ప్రయాణికులకు తగిలిన గాయాలు చిన్నవని పోలీసులు తెలిపారు. బాధితులకు వెంటనే వైద్య సహాయం అందించామని, వారు వెంటనే వెళ్లిపోయారని పేర్కొన్నారు.  ల్యాండింగ్ సమయంలో వాతావరణ పరిస్థితులు మారడం వల్లే ఈ సంఘటన జరిగిందని ప్రాథమిక పరిశోధనలు తేల్చాయని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ప్రస్తుతం సమగ్ర అధికారిక దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.

మరోవైపు “మార్చి 23న దుబాయ్-అల్ ఐన్ రోడ్డులో నలుగురు పర్యాటకులు ప్రయాణించారు. గాలి బలంగా ఉండటం, వాతావరణం అకస్మాత్తుగా మారడంతో అది హార్డ్ ల్యాండింగ్ అయింది” అని బెలూన్ ఆపరేటర్ స్పష్టం చేశారు.  

కాగా, దుబాయ్‌లో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌లు ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా గుర్తింపు పొందాయి. ప్రయాణీకులను సాధారణంగా తెల్లవారుజామున ఎడారికి తీసుకెళ్తారు. బెలూన్‌లు సూర్యోదయానికి సమయానికి బయలుదేరుతాయి. అవి ఎడారిపైకి ఎగురుతుండగా అద్భుతమైన దృశ్యాలను పర్యాటకులు ఆనందిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com