యూఏఈలో సోషల్ మీడియా ఉద్యోగ స్కామ్‌లు..హెచ్చరిక జారీ..!!
- April 08, 2025
యూఏఈ: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఉద్యోగ ప్రకటనలకు ప్రాచుర్యం పొందాయి. అయితే, స్కామర్లు అధిక సాలరీలను ఇస్తామని చేసే నకిలీ ఉద్యోగ ప్రకటనలపై జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, దాని డిజిటల్ సెక్యూరిటీ విభాగం ద్వారా ఈమేరకు హెచ్చరిక జారీ చేశారు. ఉద్యోగార్ధులను మోసం చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగించే మోసపూరిత కంపెనీల పెరుగుదల గురించి ప్రజలను హెచ్చరించారు.
"ప్రకటనలు, నియామకాలకు సోషల్ మీడియా కీలక వేదికగా పెరగడంతో నకిలీ కంపెనీలు మోసానికి పాల్పడుతున్నాయి. ఉద్యోగార్ధుల ఆకాంక్షలను దోపిడీకి వాడుకుంటున్నారు." అని డిజిటల్ సెక్యూరిటీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ మేజర్ సయీద్ అల్-షాబ్లి అన్నారు. ఈ స్కామర్లు ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ప్రకటనలను పోస్ట్ చేసి ఉపయోగించుకుంటున్నారని, అనుభవం లేదా అర్హతలు అవసరం లేకుండా అధిక జీతాలను హామీ ఇచ్చే ఆకర్షణీయమైన ఉద్యోగ ఆఫర్లను ఇచ్చి, అమాయకులను దోచుకుంఉటన్నారని ఆయన వివరించారు. తాము సోషల్ మీడియా కంపెనీలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి పని చేస్తున్నామని, వారు మరింత మంది బాధితులను మోసం చేయడానికి ముందే ఆయా ప్రకటనలను తొలగించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!







