సింగపూర్ లో అగ్ని ప్రమాదం: పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు
- April 08, 2025
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు అగ్నిప్రమాదంలో గాయాలయ్యాయి. సింగపూర్‌లో స్కూల్‌లో అగ్నిప్రమాదంలో సంభవించడంతో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అంతేగాక, అతడి ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది.
మార్క్ శంకర్‌ను స్కూల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. దీంతో పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ గిరిజనులను కలిశాక సింగపూర్ వెళ్తానని పవన్ అన్నారు. ఇవాళ ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది.
కాగా, పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పర్యటనలో ఉన్నారు. నిన్న పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామంలో ఆయన పర్యటించి, గిరిజనులతో మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న అడవితల్లి బాట ప్రోగ్రాంను ప్రారంభించారు.
పవన్ కల్యాణ్ ఇవాళ సుంకరమిట్టలో బ్రిడ్జిని ప్రారంభించాల్సి ఉంది. అలాగే, విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ వద్ద ఎకో టూరిజంపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం అభివృద్ధి, ఎకో టూరిజంపై ఆయన చర్చిస్తారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







