ఖతార్‌లో ఫేక్ ట్రాఫిక్ జరిమానాల మెసేజుల స్కామ్..!!
- April 16, 2025
దోహా: ఖతార్ మొబైల్ వినియోగదారులకు అధునాతన ఫిషింగ్ SMS స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) పంపినట్లుగా ఫేక్ సందేశాలను పంపుతూ..ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాలని లింకులను పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. “మీ వాహనం చెల్లించని ట్రాఫిక్ జరిమానా (నం. 5965) ఉంది. దయచేసి హుకూమా-మోయి ద్వారా జరిమానా చెల్లించండి. ఈరోజే ” అని ఫేక్ SMSలో పేర్కొంటున్నారు.
యూనిఫైడ్ ప్రభుత్వ వేదిక అయిన హుకూమి (https://hukoomi.gov.qa/) అధికారిక వెబ్‌సైట్ URL వలె పోలి ఉన్న లింకులను మోసగాళ్లు ఉపయోగిస్తున్నారని తెలిపారు. మోసపూరిత లింక్ ఒరిజినల్ మాదిరిగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి బాధితులను మెట్రాష్ అప్లికేషన్ కు రీ డైరెక్ట్ అవుతుందన్నారు. ఈ నకిలీ సైట్ అనుమానం లేని నివాసితుల నుండి వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందించారని పేర్కొన్నారు.
మొబైల్ వినియోగదారులు తమ ఇన్‌స్టాల్ చేయబడిన మెట్రాష్ యాప్ ద్వారా మాత్రమే ట్రాఫిక్ జరిమానాల కోసం తనిఖీ చేయాలని, స్కామ్‌ల బారిన పడకుండా నిరోధించడానికి ప్రభుత్వ అధికారుల సరైన సోషల్ మీడియా ఛానెల్‌లతో సంప్రదించాలని కోరారు. ఎవరైనా అధికారిక MoI ఛానెల్‌లను నేరుగా సంప్రదించి అనుమానాస్పద సందేశాలను వెంటనే నివేదించాలన్నారు.
తాజా వార్తలు
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్‌లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..