నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

- April 16, 2025 , by Maagulf
నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు యూరప్ పర్యటనకు బయలుదేరుతున్నారు.తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 20న తన పుట్టినరోజు వేడుకలను అక్కడే నిర్వహించనున్నారు.ఈ పర్యటన వ్యక్తిగతమైనదిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ముఖ్యమంత్రి ఈ రోజు సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరి, అక్కడి నుంచి విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం.

కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర

ఈ పర్యటనకు సంబంధించి ఏ దేశానికి వెళ్లనున్నారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. వ్యక్తిగత పర్యటన అయినందున చంద్రబాబు ప్రయాణ వివరాలను బయటపెట్టకుండా అధికారికంగా జారీ చేయలేదు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్తుండటంతో ఈ పర్యటనకు పెద్దగా అధికార కార్యకలాపాలు లేనట్లు తెలుస్తోంది. చంద్రబాబు గతంలో కూడా తన పుట్టినరోజును కుటుంబంతో కలిసి విదేశాల్లో జరుపుకున్న సందర్భాలు ఉన్నాయి.

ఈ నెల 22న తిరిగి ఢిల్లీకి

విదేశీ పర్యటన అనంతరం చంద్రబాబు ఈ నెల 22న తిరిగి ఢిల్లీకి చేరనున్నారు. అక్కడ ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కావచ్చని తెలుస్తోంది. అధికారిక వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి దేశ రాజధానిలో కేంద్రంతో కీలక చర్చలు జరిపే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ, ఇది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com