యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో భారతీయులు వీరే..
- April 17, 2025
న్యూ ఢిల్లీ: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అరుదైన గౌరవం దక్కింది. యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపికయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలకు చెందిన 116 మందిని ఈ అవార్డుకు యంగ్ గ్లోబల్ లీడర్స్ ఎంపిక చేసింది. 40 ఏళ్ల లోపు వయస్సు ఉండి వేర్వేరు రంగాల్లో తమదైన ముద్ర వేసి, ప్రపంచ స్థితిగుతల అభివృద్ధికి కృషి చేసే యువకులకు ఏటా యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డుల ప్రదానం చేయనుంది. రామ్మోహన్ నాయుడుతో పాటు భారత్ నుంచి యంగ్ గ్లోబల్ అవార్డుకు ఎంపికయ్యారు ఏడుగురు. ఇందులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు.
రితేష్ అగర్వాల్: ఈయన OYO హోటల్స్ అండ్ హోమ్స్ వ్యవస్థాపకుడు.
కింజరాపు రామ్మోహన్ నాయుడు: ఈయన భారత పౌర విమానయాన శాఖ మంత్రి.
మానసి సుబ్రమణ్యం: ఈమె పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియాలో చీఫ్ ఎడిటర్, వైస్ ప్రెసిడెంట్ హోదాలో పనిచేస్తున్నారు.
నటరాజన్ శంకర్: బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌లో మేనేజింగ్ డైరెక్టర్, భాగస్వామిగా పనిచేస్తున్నారు.
అనురాగ్ మాలూ: ఈయన పర్వతారోహకుడు. ఓరోఫైల్ వెంచర్స్ (క్లైంబింగ్ 4SDGs)లో కీనోట్ స్పీకర్.
నిపున్ మల్హోత్రా : ఈయన నిప్మాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు.
అలోక్ మెడికేపుర అనిల్ : ఈయన నెక్స్ట్ బిగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్.
హిమాంశు గుప్తా: క్లైమేట్ ఏఐ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓగా ఉన్నారు.
తెరాశ్ని పిళ్లై: ఈమె స్విస్ ఆర్‌ఈ కార్పొరేట్ సొల్యూషన్స్ ఆఫ్రికా విభాగం సీఈఓగా ఉన్నారు.
ఏటా 100 మందికిపైగా ప్రభావవంతమైన యువత
కాగా, సూమారు దాదాపు 1000 కార్పొరేట్ కంపెనీలు కలిసి వరల్డ్ ఎకానమిక్ ఫోరంను నడుపుతున్నాయి. ఆ కంపెనీల నుంచే వరల్డ్ ఎకానమిక్ ఫోరం నిర్వహణకు నిధులు సమకూరుతుంటాయి. ఏటా 100 మందికిపైగా ప్రభావవంతమైన యువతను యంగ్ గ్లోబల్ లీడర్ పురస్కారాలకు ఎంపిక చేస్తారు. వారికి మూడేళ్ల పాటు వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలను వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఏర్పాటు చేస్తుంది. వరల్డ్ ఎకానమిక్ ఫోరంకు నిధులను అందించే కంపెనీల విజన్‌కు అనుగుణంగానే ఈ కార్యక్రమాలన్నీ డిజైన్ అవుతాయి. ఆర్థిక, టెక్, ప్రభుత్వ వ్యవహారాలు, క్రియేటివ్ పరిశ్రమలు, ప్రజా సేవ వంటి విభాగాల యువతను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







