విదేశాలకు తగ్గుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య
- April 17, 2025
విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది.గత ఐదేళ్లలో పోలిస్తే ఇదే తొలిసారి.ముఖ్యంగా కెనడా, అమెరికా, యూకేల్లో వీసా తిరస్కరణలు కూడా కారణం కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.2024లో ఈ మూడు దేశాల నుంచి భారతీయ విద్యార్థులకు లభించే స్టూడెంట్ వీసాల్లో 25శాతం తగ్గుముఖం పట్టాయి.
తగ్గిన 32శాతం భారతీయ విద్యార్థులు
కెనడాకు వెళ్లేవారి భారతీయ విద్యార్థుల సంఖ్యలో 32శాతం తగ్గింది.ఇది 2.78లక్షల నుంచి 1.89 లక్షలకు చేరుకొంది.ఈ విషయాన్ని ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా సంస్థ వెల్లడించింది. ఇక అమెరికాకు వెళ్లే వారి సంఖ్య 34 శాతం పడిపోయింది. దీంతో 2024లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఎఫ్1 వీసాల్లో 1,31,000 నుంచి 86,000కు తగ్గుదల కనిపించింది.యూకేకు వెళ్లే వారి సంఖ్యలో 26శాతం తగ్గుదల నమోదైంది.అంతకు ముందు ఏడాది 1,20,000 విద్యార్థి వీసాలు ఉండగా, తాజాగా యూకే హోమ్ ఆఫీస్ లెక్కల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో 88,732కు తగ్గాయి.
కెనడా-భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు
ముఖ్యంగా కెనడా, యూకే దేశాలు విద్యార్థి వీసాలపై పరిమితులు విధించాయి. ఈ పరిస్థితే కారణంగా నిలిచాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ముఖ్యంగా కెనడా- భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కూడా కారణమయ్యాయి. ఆ దేశంలో భారతీయ విద్యార్థులపై పలు ఆంక్షలు విధించడం, స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ప్రోగ్రామ్‌ను వేగవంతం చేయడమే కాకుండా, తమ దేశంలో తాత్కాలికంగా నివశించే విదేశీయు సంఖ్యను 2026 నాటికి 5 శాతానికి తగ్గించాలన్న నిర్ణయం కూడా వీసాల తగ్గుముఖం ప్రభావం పడింది. విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా ఉండటం వల్ల గృహ, ఆరోగ్య, ఇతర ప్రజాసేవలకు భారంగా మారుతోందన్న కెనడా, భారతీయ విద్యార్థులకు కేటాయించే స్టడీ పర్మిట్లను 32శాతం తగ్గించింది. అదే సమయంలో చైనీయులకు కేవలం 3శాతానికే కుదించింది.
2023 నుంచే భారతీయులకు తగ్గించిన వీసాలు
ఇక యూకే కూడా విదేశీ విద్యార్థులు వారిపై ఆధారపద్యార్థి డిన తమ దేశానికి తీసుకురాకుండా నిబంధనలు విధించింది. ఈ కారణం వల్ల ఆ దేశానికి వీసాకు దరఖాస్తు చేసేవారి సంఖ్య తగ్గింది. వాస్తవానికి కొవిడ్ తర్వాత 2023 నుంచే భారతీయులకు విద్యార్థి వీసాలు ఇవ్వడం తగ్గిస్తూ వచ్చింది. ఆ ఏడాది 13 శాతం తగ్గుదల కనిపించింది. 2024కి వచ్చేసరికి అది 26శాతానికి పరిమితమైంది.
రాజకీయంగా ఉద్రిక్తతల నేపథ్యంలో. భారతీయ విద్యార్థులపై ఆంక్షలు, స్క్రూటినీ పెరిగింది.
గృహ అవసరాలు, హెల్త్‌కేర్, ప్రజాసేవలపై భారం పెరగడం వల్ల, కెనడా ప్రభుత్వం విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించాలన్న నిష్కర్షకు వచ్చింది. భారతీయులకు 32% స్టడీ పర్మిట్లు తగ్గించగా,చైనీయులకు కేవలం 3%కే వీసాలు ఇచ్చారు.
అమెరికా: 34% వీసా రద్దులు
2023లో: 1,31,000 ఎఫ్1 వీసాలు, 2024లో: 86,000 మాత్రమే, 34% తగ్గుదలవీసా ప్రాసెసింగ్ పై ఖచ్చిత నియంత్రణలు, రాజకీయ కారణాల వల్ల ఆధారపడి వచ్చే కుటుంబ సభ్యులకు కూడా అవకాశం తగ్గింపు కారణంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!