మొజాంబిక్ తో భారత్ భారీ ఒప్పందం
- July 07, 2016
భారతదేశంలో పప్పు ధాన్యాల ధరలు భగ్గుమంటుండటంతో.. వాటిని మొజాంబిక్ నుంచి దిగుమతి చేసుకోడానికి వీలుగా రెండు దేశాల మధ్య ఒక దీర్ఘకాలిక ఒప్పందం కుదిరింది. దీంతో పాటు మొత్తం మూడు ఒప్పందాలు రెండు దేశాలకు కుదిరాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తుతం నాలుగు ఆఫ్రికన్ దేశాల పర్యటనలో భాగంగా మొజాంబిక్ లో ఉన్న విషయం తెలిసిందే.
ఆయన నేతృత్వంలో ఇరు దేశాల అధికారులు సమావేశమై, చర్చించుకున్న తర్వాత ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసీ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. క్రీడలు యువజన వ్యవహారాలలో సహకారం, డ్రగ్స్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం, తదితర అంశాలపై కూడా ఒప్పందాలు కుదిరాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పు ఉగ్రవాదమేనని, అందువల్ల రక్షణ రంగంలో ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







