భారత్ లో పెరుగుతున్న వేడి గాలులు..
- April 22, 2025
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగాలులు వీయనున్నట్లు భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య భారతదేశంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో దక్షిణ ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణా, విదర్భ ప్రాంతాలు ఉన్నాయి. వీటికి ఏప్రిల్ 25 వరకు యెల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.
కొన్ని ప్రాంతాల్లో వడగాలులు ప్రభావం
గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు ప్రభావం ఉంటుందని IMD తెలిపింది. ఏప్రిల్ 25 వరకు వేడి, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వివరించింది. అయితే, ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మణిపుర్, మేఘాలయ్, నాగాలాండ్, త్రిపుర, మిజోరంలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది.
సాధారణానికి మించి వర్షాలు
మరోవైపు ఇటీవలె వ్యవసాయ రంగానికి తీపి కబురు చెప్పింది భారత వాతావరణ విభాగం (ఐఎండీ). ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో (జూన్-సెప్టెంబరు) దేశ వ్యాప్తంగా సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని పేర్కొందిత. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వానలు పడే అవకాశం ఉందని ప్రటించింది. 1971 నుంచి 2020 వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా దీర్ఘకాలంలో సగటున 87 సెంటీమీటర్ల వర్షం కురుస్తోందని, ఇప్పుడు అందులో 105% దాకా వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.
ఈశాన్య రాష్ట్రాలకు వర్షాలు తక్కువ
అలాగే సాధారణానికి మించి, అధిక వర్షపాత అంచనాలను కలిపి చూస్తే 56% మంచి వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది. అలానే ఈ ఏడాదిలో ఎల్‌నినో ఏర్పడే పరిస్థితులు లేవని వివరించింది. డిసెంబరు-మార్చి మధ్య హిమాలయాలు, యూరో ఏసియా ప్రాంతంలో మంచు తక్కువగా ఉందని, ఇవన్నీ మంచి వర్షాలు కురవడానికి శుభపరిణామాలని IMD పేర్కొంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!