నీట మునిగి భారతీయ వలసదారుడి మృతి
- July 08, 2016
థామస్ జాన్ అనే భారతీయ వలసదారుడు, ఖతార్ ఇంజనీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ (క్యుయెకాన్)లో పనిచేస్తున్నాడు. 15 మందితో కలిసి, ఈద్ సెలవుల సందర్భంగా విహార యాత్రకు వెళ్ళిన థామస్ జాన్ ప్రమాదవశాత్తూ నీట మునిగాడు. ఆయనతోపాటు మరో ముగ్గురు కూడా నీట మునిగినా, వారిని ప్రాణాలతో కాపాడగలిగారు సన్నిహితులు. అయితే జాన్ మాత్రం ప్రాణాలు నిలుపుకోలేకపోయాడు. నీటిలోంచి జాన్‌ని బయటకు తీసిన సన్నిహితులు, అతన్ని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించినా, అతని ప్రాణాల్ని కాపాడలేకపోయారు. ఈద్ సెలవుల సందర్భంగా బీచ్ పరిసరాలు జనం సందడితో నిండిపోయింది. ఇలాంటి సందర్భాల్లో సరైన అవగాహన లేక, విహార యాత్రల్ని విషాదయాత్రలుగా మార్చుకుంటుంటారు. ఖతార్‌లో జాన్ 1996 నుంచి నివాసం ఉంటున్నారు. వక్రాలోని హమాద్ మాస్పిటల్ మార్చురీలో జాన్ మృతదేహాన్ని ఉంచారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







