విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ కాంబినేషన్ లో సినిమా
- April 28, 2025
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ తో ఇండియన్ సినిమాని మరోసారి షేక్ చేయడానికి సిద్ధంగా వున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ , చార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో టబు కీలక పాత్ర పోషించనుంది.
ఎక్సయిట్మెంట్ ని మరింత పెంచుతూ, శాండల్‌వుడ్ డైనమో విజయ్ కుమార్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రని పోషించడానికి ప్రాజెక్ట్ లోకి వచ్చారు. మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, హై-ఆక్టేన్ పెర్ఫార్మెన్స్‌లతో అడగొట్టే విజయ్ కుమార్ బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి తర్వాత చేస్తున్న రెండో తెలుగు సినిమా ఇది.
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నెవర్ బిఫోర్ క్యారెక్టర్ కనిపించబోతున్నారు. విజయ్ సేతుపతి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్, డిఫరెంట్ అవతార్ లో చూడబోతున్నారు ఆడియన్స్. ఈ ప్రాజెక్ట్ తో తెలుగు సినిమాకి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తున్న టబు కథలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు, విజయ్ కుమార్ ప్రాజెక్ట్ లోకి రావడంతో ఎక్సయిట్మెంట్ మరింతగా పెరిగింది.
ఈ హైలీ యాంటిసిపేటెడ్ సినిమా కోసం పూరి జగన్నాధ్ పవర్ ఫుల్ కథ ని రాశారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం హిందీ భాషలలో విడుదల కానుంది.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభమవుతుంది
తారాగణం: విజయ్ సేతుపతి, టబు, విజయ్ కుమార్
సాంకేతిక సిబ్బంది:
రచన,దర్శకత్వం : పూరి జగన్నాథ్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
CEO: విషు రెడ్డి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







