ఎన్నారై సంఘాలు, నిపుణులతో 16న సమావేశం కానున్న మంత్రి కేటీఆర్
- July 08, 2016
గల్ప్ తో పాటు విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రవాసీలు భరోసా కల్పించేలా తెలంగాణ ఏన్నారై పాలసీని రూపొందిస్తున్నామని, ఇందుకోసం ఇప్పటికే ముసాయిదా విధానం (డ్రాఫ్ట్ పాలసీ) సిద్ధం అయ్యిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నారై మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) తేది: 08.07.2016 న తెలిపారు. ఎన్నారై సంఘాలు, నిపుణులతో శనివారం తేది: 16.07.2016 న హైదరాబాద్ లో సమావేశం నిర్వహించి డ్రాప్ట్ పాలసీ పైన సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు.
గల్ప్ ఎన్నారైలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, తెలంగాణలో ఉపాధి కల్పనకు అనేక ప్రయత్నాలు చేస్తున్నామని ఎన్నారై శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. గల్ప్ కు వెళ్లే యువతకు చట్టబద్దంగా, పక్కా జీవనోపాధికి హమీ ఇస్తూ ఉద్యోగాలు కల్పించే తెలంగాణ ఒవర్ సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (టామ్ కామ్) ను మరింత విస్తరిస్తామన్నారు. తేది: 08.07.2016 న సైబరాబాద్ కమీషనరేట్, గచ్చిబౌలిలో 'టామ్ కామ్' నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 'టామ్ కామ్' ద్వారా గల్ప్ లో ఉపాది పొందిన 250 మందికి వీసాలు అందజేశారు. త్వరలోనే మరో 500 మందికి ఉపాది కల్పించనున్నట్లు మంత్రి కి అధికారులు వివరించారు.
తెలంగాణలోని కోటి ఏకరాలకు నీరు అందించే ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ భగీరథ, నూతన పారిశ్రామిక విధానం ద్వారా ఇప్పటికే 2300 వందల కంపెనీలకు అనుమతులు ఇచ్చామన్నరు. ఇందులో సగానికిపైగా కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయని, సమూరు 40 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, దీంతో లక్షా 35 వేల మందికి ప్రత్యక్షం, పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. ఈ విధంగా తెలంగాణ యువతకు ఉపాది కల్పనకు కృషి చేస్తున్నామన్న మంత్రి, మరోవైపు గల్ప్ కు , విదేశాలు వెళ్లే వారికోసం కట్టుదిట్టమైన, చట్టబద్ద విధానాల్లోనే వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా గల్ప్ ఏజెంట్ల మోసాలను అరికట్టేలా 'టామ్ కామ్' ద్వారా ఉపాది కల్పిస్తామన్నారు. చట్టబద్దంగా వెళ్లే వారికి ప్రమాదాలు జరిగేతే రక్షణ ఉంటుందని, అయా కుటుంబాలకు భరోసా ఉంటుందన్నారు.
అబుదాబిలో మరణించిన నిజామాబాద్ జిల్లావాసి తిప్పల నర్సయ్య కుటుంబానికి జజీరా ఎమిరేట్స్ పవర్ కంపెనీ ఇచ్చిన 46 లక్షల 15 వేల రూపాయాల సహాయాన్ని ప్రకటించింది. ఏ మేరకు చెక్కును మంత్రి కేటీఆర్ చేతులమీదుగా మృతుని కుటుంబానికి అందజేశారు. జజీరా ఎమిరేట్స్ పవర్ కంపెనీ అధినేత దువ్వూరి కిషోర్ బాబు ను మంత్రి అభినందించారు. ఈ సమావేశంలో హోశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, కార్మిక శాఖ ఉన్నతాధికారి కె.వై. నాయక్, 'టామ్ కామ్' జనరల్ మేనేజర్ భవాని, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సైబరాబాద్ ఈస్ట్ పోలీస్ కమీషనర్ మహేష్ మురళీధర్ భగవత్ తదితరులు పాల్గొన్నారు.
- మంద భీంరెడ్డి, ఎడిటర్, 'ప్రవాసి మిత్ర'


తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







