ఇంద్రకీలాద్రిలో ఈ మూడు రోజులు ఘాట్‌రోడ్డు మూసివేత..
- May 03, 2025
విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో ఈ నెల 6 నుంచి 8 వరకు ఘాట్ రోడ్డును మూసివేస్తున్నారు. మరమ్మతు పనులు చేయనున్న నేపథ్యంలో ఘాట్ రోడ్డును ఆయా తేదీల్లో పూర్తిగా మూసేస్తున్నామని ఆలయ కార్య నిర్వహణ అధికారి కె. రామచంద్ర మోహన్ తెలిపారు.
కనకదుర్గ నగర్ మార్గం నుంచి భక్తులు దేవస్థానానికి చేరుకోవాల్సి ఉటుందని అధికారులు చెప్పారు. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు పున్నమి ఘాట్‌లో తమ వాహనాలు పార్క్ చేసుకోవాలి. అక్కడినుంచి దేవస్థానం ఏర్పాటు చేస్తున్న ఉచిత బస్సు ద్వారా దేవస్థానానికి చేరుకోవచ్చు.
విశాఖపట్నం, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సీతమ్మ వారి పాదాల ప్రాంతంలో హోల్డింగ్ ఏరియాలో వాహనాలు పార్కు చేసుకుని దేవస్థానం ఏర్పాటు చేసే ఉచిత బస్సు ద్వారా దేవస్థానానికి చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మూడు రోజులు ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం కల్పించామని ఈవో తెలిపారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







