విశ్వంభర నుంచి అవనిగా త్రిష కృష్ణన్ పరిచయం
- May 04, 2025మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విశ్వంభర. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈ సంవత్సరం మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రాలలో ఒకటి. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన పోస్టర్లు, విజువల్ వండర్ టీజర్, ఆధ్యాత్మికంగా నిండిన ఫస్ట్ సింగిల్-రామరామతో భారీ అంచనాలను పెంచింది. UV క్రియేషన్స్ విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు.
త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, విశ్వంభరలోని ఆమె పాత్ర అవనిగా పరిచయం చేశారు. రాజసం ఉట్టిపడే చీరకట్టులో మెరిసిపోతు కనిపించారు త్రిష. ఈ పోస్టర్ కి ట్రమండస్ రెస్పాన్స్ వస్తోంది.
వశిష్ఠ విజన్, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న విశ్వంభర పురాణ గాధలను మోడరన్ సినిమాతో బ్లెండ్ చేస్తోంది. హై క్వాలిటీ VFX, భారీ CGI బడ్జెట్, అద్భుతమైన కథ ప్రేక్షకులకు విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.
ఈ చిత్రంలో ఆశికా రంగనాథ్ మరో హీరోయిన్ గా నటిస్తుండగా, కునాల్ కపూర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి డీవోపీ చోటా కె నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్ ఎఎస్ ప్రకాష్.
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి
డిఓపి: చోటా కె నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్ ప్రకాష్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







