కువైట్‌లో దుమ్ము తుఫాను..ఇండిగోతో సహా మూడు విమానాలు మళ్లింపు..!!
- May 05, 2025
కువైట్: కువైట్‌లో దుమ్ము తుఫాను కారణంగా ఆదివారం సాయంత్రం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విజిబిలిటీ గణనీయంగా తగ్గింది. దీని ఫలితంగా సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయానికి వచ్చే మూడు విమానాలను దారి మళ్లించారు. అస్థిర వాతావరణ పరిస్థితుల మధ్య ప్రయాణీకులను, విమానాలను రక్షించడానికి అత్యున్నత అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని ముందు జాగ్రత్త చర్యలు అమలు చేస్తునట్టు ఎయిర్ నావిగేషన్ విభాగం డైరెక్టర్ దావూద్ అల్-జర్రా తెలిపారు. విజిబిలిటీ 300 మీటర్ల కంటే తక్కువగా పడిపోవడం వల్ల అస్సియుట్, కైరో నుండి వచ్చిన రెండు ఎయిర్ కైరో విమానాలు, ఢిల్లీ నుండి వచ్చిన ఇండిగో విమానాలను దమ్మామ్‌లోని సమీపంలోని విమానాశ్రయానికి మళ్లించోటు వెల్లడించారు. కాగా, దుమ్ము తుఫాను ఉన్నప్పటికీ షెడ్యూల్ చేయబడిన ఇతర విమానాలు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







