8 ఏళ్ల బాలికను సత్కరించిన దుబాయ్ పోలీసులు..!!
- May 05, 2025
దుబాయ్: ఒక మాల్లోని సినిమాలో దొరికిన దిర్హామ్‌లు 17,000 నగదును ఎనిమిదేళ్ల బాలిక పోలీసులకు అప్పగించింది. ఆమె నిజాయితీని పోలీసులు మెచ్చుకొని అవార్డు అందజేయనున్నట్లు ప్రకటించారు.
ఈజిప్టుకు చెందిన లిల్లీ జమాల్ రమదాన్ అనే బాలిక తన తల్లిదండ్రులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లింది. ఈక్రమంలో టిక్కెట్లు కొనడానికి వేచి ఉన్న బెంచ్ మీద కూర్చుని ఉండగా, కొంత నగదును గుర్తించింది. వెంటనే తన తల్లిదండ్రులకు తెలియజేసింది. ఆ మొత్తాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆమె తండ్రి, తన కుటుంబంతో కలిసి నగదును అందజేయడానికి అల్ రషీదియా పోలీస్ స్టేషన్‌కు వెంటనే వెళ్లారు. అదే సమయంలో ఆ నగదును పోగొట్టుకున్న వ్యక్తి కూడా ఫిర్యాదు చేయడానికి స్టేషన్లో ఉన్నాడు. లిల్లీ నిజాయితీని మెచ్చుకున్న మేజర్ జనరల్ నిపుణుడు ఖలీల్ ఇబ్రహీం అల్ మన్సూరి ఆమెను సత్కరించారు. ఇలాంటి చర్యలు కమ్యూనిటీపై సానుకూల ప్రభావం చూపుతుందని అన్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!