UPSC చైర్మెన్‌గా అజయ్ కుమార్ నియామకం
- May 14, 2025
న్యూ ఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మెన్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ ను నియమించారు. కేంద్ర వ్యక్తిగత వ్యవహారాల శాఖ తన ఆదేశాల్లో ఈ విషయాన్ని తెలిపింది. ఏప్రిల్ 29వ తేదీన ప్రీతి సుదన్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఆ పోస్టు అప్పటి నుంచి ఖాళీగా ఉన్నది. అజయ్ కుమార్‌ను యూపీఎస్సీ చైర్మెన్‌గా నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్లియర్ చేశారు. 1985 నాటి ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయనది కేరళ క్యాడర్. ఆగస్టు 23, 2019 నుంచి అక్టోబర్ 31, 2022 వరకు రక్షణశాఖ కార్యదర్శిగా ఆయన చేశారు. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్‌తో పాటు ఇతర పరీక్షలను యూపీఎస్సీ నిర్వహించే విషయం తెలిసిందే. యూపీఎస్సీకి ఓ చైర్మెన్ ఉంటారు. దాంట్లో 10 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం యూపీఎస్సీలో ఇద్దరు సభ్యులకు ఖాళీలు కూడా ఉన్నాయి. యూపీఎస్సీ చైర్మెన్‌ను ఆరేళ్ల కోసం అపాయింట్ చేస్తారు. ఆ వ్యక్తి వయసు 65 ఏళ్లు దాటకుండా ఉండాలి.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!