గ్లోబల్ నెట్‌వర్క్ ఎక్సలెన్స్ ఇండెక్స్‌.. MENA , GCC లో బహ్రెయిన్ టాప్..!!

- May 14, 2025 , by Maagulf
గ్లోబల్ నెట్‌వర్క్ ఎక్సలెన్స్ ఇండెక్స్‌.. MENA , GCC లో బహ్రెయిన్ టాప్..!!

మనామా: స్వతంత్ర విశ్లేషణ సంస్థ ఓపెన్‌సిగ్నల్ ప్రకారం.. మొబైల్ నెట్‌వర్క్ నాణ్యతకు ప్రపంచ ప్రమాణమైన గ్లోబల్ నెట్‌వర్క్ ఎక్సలెన్స్ ఇండెక్స్‌లో మీనా, జీసీసీ ప్రాంతాలలో బహ్రెయిన్ మొదటి స్థానంలో ఉంది.  బహ్రెయిన్ దాని అత్యుత్తమ 4G/5G లభ్యత, వేగవంతమైన డౌన్‌లోడ్ వేగం,  విశ్వసనీయ నెట్‌వర్క్ నాణ్యతకు గుర్తింపు పొందింది. ఈ ర్యాంకింగ్ బహ్రెయిన్ అధునాతన మౌలిక సదుపాయాలు, భవిష్యత్ డిజిటల్ అవసరాలకు సంసిద్ధతను ప్రతిబింబిస్తుందని టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) వెల్లడించింది.

TRA జనరల్ డైరెక్టర్ ఫిలిప్ మార్నిక్ మాట్లాడుతూ.. ఈ విజయం డిజిటల్ మౌలిక సదుపాయాలలో బహ్రెయిన్ నాయకత్వాన్ని,  అందరికీ అధిక-నాణ్యత కనెక్టివిటీని నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు.   టెలికాం ఆపరేటర్లు ప్రపంచ స్థాయి సేవలను అందించడానికి వీలుగా పోటీతత్వం, వినూత్న వాతావరణాన్ని సృష్టించడానికి TRA అవిశ్రాంతంగా కృషి చేసిందన్నారు. ఈ సందర్భంగా కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, బహ్రెయిన్ స్థానాన్ని పటిష్టం చేసిన క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాలకు ధన్యవాదాలు తెలియజేశారు.  టెలికమ్యూనికేషన్లలో బహ్రెయిన్ అగ్రగామి స్థానాన్ని కొనసాగించడంలో TRA అచంచల ప్రయత్నాలకు ఈ విజయం నిదర్శనంగా నిలిచింది. ప్రపంచ పురోగతికి అనుగుణంగా, ఈ ప్రాంతానికి ప్రమాణాలను నిర్దేశిస్తుంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com