ఎమిరాటీయేతరులకు యూఏఈ మాండలికం నిషేధం.. కొత్త మీడియా విధానం..!!

- May 14, 2025 , by Maagulf
ఎమిరాటీయేతరులకు యూఏఈ మాండలికం నిషేధం.. కొత్త మీడియా విధానం..!!

యూఏఈ: యూఏఈ పౌరులు మాత్రమే మీడియా ఛానెళ్లలో ఎమిరాటీ మాండలికంలో మాట్లాడటానికి అనుమతించే కొత్త విధానం గురించిన నిర్ణయం వెనుక గల కారణాన్ని ఓ యూఏఈ ఉన్నతాధికారి ఒకరు వివరించారు, “ఎమిరాటీ పౌరుడు జాతీయ మాండలికం, దుస్తులు క్క నిజమైన విలువను బాగా అర్థం చేసుకోగలడు. ఎందుకంటే అవి జాతీయ గుర్తింపుకు చిహ్నం.  దేశ సాంస్కృతిక, చారిత్రక వారసత్వం స్వరూపం” అని పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC) సమావేశంలో ఈ విధానంపై చర్చించారు.

నేషనల్ మీడియా ఆఫీస్ చైర్మన్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ బిన్ బుట్టి అల్ హమీద్, X ద్వారా చేసిన ఒక ప్రకటనలో..  ఈ నియంత్రణ ప్రాముఖ్యతను తెలిపారు. “ఎమిరాటీ మాండలికం,  సాంస్కృతిక చిహ్నాలను, ముఖ్యంగా ప్రకటనలలో తప్పుగా సూచించే సందర్భాలు పెరుగుతున్నందుకు ప్రతిస్పందనగా ఈ విధానం అమలు చేయబడింది.” అని తెలారు. అల్ హమీద్ ఎమిరాటీ మాండలికాన్ని సంరక్షించడం ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు.  

   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com