శ్రీనగ‌ర్ నుంచి విమాన స‌ర్వీస్ లు పునరుద్ద‌ర‌ణ: కేంద్ర మంత్రి రామ్మోహ‌న్

- May 15, 2025 , by Maagulf
శ్రీనగ‌ర్ నుంచి విమాన స‌ర్వీస్ లు పునరుద్ద‌ర‌ణ: కేంద్ర మంత్రి రామ్మోహ‌న్

శ్రీన‌గ‌ర్: నేటి నుంచి శ్రీన‌గ‌ర్ విమానాశ్ర‌యం నుంచి విమాన స‌ర్వీస్ లు పునురుద్ద‌రించిన‌ట్లు కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు తెలిపారు.. నేడు ఆయ‌న‌ జ‌మ్ము, శ్రీన‌గ‌ర్ లో పర్యటించారు.. విమానాశ్ర‌యాల‌ల‌ను ఆయ‌న ప‌రిశీలించారు.. అక్క‌డ విమానయాన స‌ర్వీస్ ల‌పై ఆరా తీశారు.. అలాగే శ్రీనగర్‌, జమ్ము ఎయిర్‌పోర్టుల్లో భద్రతపై ఎయిర్ పోర్ట్ అధికారుల‌తో సమీక్ష నిర్వ‌హించారు..

ఆపరేషన్‌ సింధూర్‌ తరువాత పరిణామాలపై అధికారుల‌ను అడిగి వివరాల‌ను తెలుసుకున్నారు.. కాగా యుద్ధ స‌మ‌యంలో ధైర్యంగా వ్య‌వ‌రించిన శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందిని కేంద్ర‌మంత్రి ఈ సంద‌ర్భంగా అభినందించారు. ఇక ఆప‌రేష‌న్ సింధూర్ స‌మ‌యంలో ఆర్మీకి ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది పూర్తిగా సహకరించార‌ని వెల్ల‌డించారు.. ఇక నేటి నుంచి శ్రీనగర్‌ నుంచి విమాన రాకపోకలను పునరుద్దరిస్తున‌ట్లు చెప్పారు. ప్ర‌యాణీకుల‌ను సుర‌క్షింతంగా వారి వారి గ‌మ్య స్థానాల‌కు చేర్చ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు.. అలాగే ప్ర‌యాణీకుల భ‌ద్ర‌త విష‌యంలో విమాన‌యాన సిబ్బంది చేస్తున్న సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివ‌ని అన్నారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com