హరి హర వీర మల్లు రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..

- May 16, 2025 , by Maagulf
హరి హర వీర మల్లు రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీర మల్లు’ సినిమా జూన్ 12న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. క్రిష్ జాగర్లమూడి, ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం ఆధారంగా రూపొందించబడింది.

కాగా, గతం లో సోషల్ మీడియా వేదికగా నిర్మాత తన ఆనందాన్ని పంచుకుంటూ.. “చిత్రీకరణ పూర్తయింది. ఇక థియేటర్లలో కలుసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అద్భుతమైన పాటలు, పవర్‌ఫుల్ ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయనున్నాం,” అని వెల్లడించారు.
ఈ చిత్రం మొదటి నుంచి అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. గతంలో మే 9 విడుదల తేదీని ప్రకటించినప్పటికీ, షూటింగ్ పెండింగ్ ఉండటంతో విడుదలను మళ్ళీ రీషెడ్యూల్ చేశారు. అయితే, ఎట్టకేలకు జూన్ 12న విడుదల ఫిక్స్ చేసుకున్నాడు వీరమల్లు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. డబ్బింగ్, రీ-రికార్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జోరుగా కొనసాగుతోంది.

ఈ చిత్రానికి తొలుత దర్శకుడుగా క్రిష్ జాగర్లమూడి పని చేయగా, తరువాత బాధ్యతలను నిర్మాత రత్నం కుమారుడు జ్యోతికృష్ణ స్వీకరించారు. ఇందులో చారిత్రాత్మక యోధుడిగా ఓ విభిన్నమైన, పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com