ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం

- January 19, 2026 , by Maagulf
ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం

దుబాయ్: చంద్రుడికి వెళ్లాలనే కల ఎప్పుడైనా కంటున్నారా? ఇప్పుడు ఆ కలను నిజం చేసుకునే అరుదైన అవకాశం అందుబాటులోకి వచ్చింది. NASA తన ఆర్టెమిస్-II (Artemis II) మిషన్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఉచితంగా పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తోంది.

‘Send Your Name with Artemis II’ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా, మీ పేరును చంద్రుడి ప్రయాణంలో భాగం చేయవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం పూర్తిగా ఉచితం కాగా, జనవరి 21 లోపు నమోదు చేసుకుంటే సరిపోతుంది.

ఆర్టెమిస్-II మిషన్ అంటే ఏమిటి?

ఆర్టెమిస్-II మిషన్ NASA చేపట్టిన చంద్రయాత్రల శ్రేణిలో కీలకమైన దశ. ఇది మనుషులతో నిర్వహించే మొదటి పరీక్షా ప్రయాణం, ఇందులో నలుగురు వ్యోమగాములు చంద్రుడి చుట్టూ తిరిగి భూమికి తిరిగి వస్తారు.

ఈ మిషన్‌లో పాల్గొనే వ్యోమగాములు:

  • రీడ్ విస్మన్ (Reid Wiseman)
  • విక్టర్ గ్లోవర్ (Victor Glover)
  • క్రిస్టినా కోచ్ (Christina Koch)
  • కెనడియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి జెరెమీ హాన్సెన్ (Jeremy Hansen)
  • మీ పేరు ఎలా అంతరిక్షంలోకి వెళ్తుంది?

నమోదు చేసిన ప్రతి వ్యక్తి పేరు:

ఒరియన్ (Orion) అంతరిక్ష నౌకలో
SLS (Space Launch System) రాకెట్ ద్వారా
చంద్రుడి వైపు ప్రయాణిస్తుంది.
పాల్గొన్న వారికి వారి పేరుతో కూడిన డిజిటల్ బోర్డింగ్ పాస్ అందజేస్తారు. అన్ని పేర్లను ఒక SD కార్డ్‌లో భద్రపరిచి, ప్రయోగానికి ముందు ఒరియన్ నౌకలో లోడ్ చేస్తారు.

ప్రత్యేకమైన బహుమతిగా కూడా ఉపయోగించుకోవచ్చు

వచ్చే నెల వాలెంటైన్స్ డే, కొత్త సంవత్సరం సందర్భంగా, మీ కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు చంద్రుడి ప్రయాణ టికెట్‌గా ఇది ఒక ప్రత్యేకమైన గిఫ్ట్‌గా మారవచ్చు.

నమోదు చేసుకునే లింకులు

ఇంగ్లీష్ బోర్డింగ్ పాస్ కోసం:
https://go.nasa.gov/artemisnames
స్పానిష్ బోర్డింగ్ పాస్ కోసం:
https://go.nasa.gov/TuNombreArtemis
NASA ఎక్స్‌ప్లోరేషన్ సిస్టమ్స్ డెవలప్‌మెంట్ మిషన్ డైరెక్టరేట్ యాక్టింగ్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ లోరి గ్లేజ్ మాట్లాడుతూ:

“ఆర్టెమిస్-II మిషన్ చంద్రుడిపై మళ్లీ మనుషులను పంపే దిశగా కీలక అడుగు. భవిష్యత్తులో మంగళగ్రహ యాత్రలకు ఇది మార్గం వేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అంతరిక్ష అన్వేషణలో భాగస్వాముల్ని చేయడమే మా లక్ష్యం.”

ప్రయోగ తేదీ

  • వ్యవధి: 10 రోజుల మిషన్
  • ప్రయోగం: ఏప్రిల్ 2026 లోపు (లేటెస్ట్)
  • ప్రాధాన్యం: NASA ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో తొలి మానవ సహిత చంద్రయానం
  •  ఇప్పుడు మీరు కూడా చంద్రుడికి వెళ్లినవారిలో ఒకరిగా మీ పేరును నమోదు చేసుకోవచ్చు—అదీ పూర్తిగా ఉచితంగా!                                                                                                                                                                                                     --బాజీ షేక్(యూఏఈ)                       
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com