ఇద్దరు ISIS ఉగ్రవాదులు అరెస్టు
- May 17, 2025
ముంబై: ముంబై విమానాశ్రయంలో ఉగ్రవాద సంస్థ ఐసీస్ స్లీపర్ సెల్‌లో భాగమైన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారులు శనివారం తెలిపారు. 2023లో మహారాష్ట్రలోని పూణేలో ఐఈడీల తయారీ, పరీక్షలకు సంబంధించిన కేసులో వీరిద్దరూ వాంటెడ్‌గా ఉన్న అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ ‘డైపర్‌వాలా’, తల్హా ఖాన్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు.
వీరు ఇండోనేషియాలోని జకార్తా నుండి భారత్‌కు తిరిగి వచ్చారని..గత రాత్రి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 వద్ద ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు.అనంతరం ఎన్‌ఐఏ బృందం వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇద్దరు నిందితులు రెండేళ్లకు పైగా పరారీలో ఉన్నారని..వారి పై ముంబైలోని ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్‌కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







