ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్..28 మంది మావోయిస్టులు మృతి..
- May 21, 2025
మావోయిస్టులకు మరోసారి గట్టి షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతిచెందారు. మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది.
మూడ్ ప్రాంతంలో ఉదయం నుంచి ఎన్ కౌంటర్ జరుగుతున్నట్లు తెలిసింది. ఈ ఆపరేషన్ లో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ డీఆర్జీ బలగాలు భారీగా పాల్గొన్నాయి. ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, భద్రతా దళాల ఎన్ కౌంటర్ లో మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. ఎన్ కౌంటర్ జరుగుతున్నట్లు నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధ్రువీకరించారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







