హైదరాబాద్ మెట్రో టికెట్ రేట్లు తగ్గాయ్..

- May 23, 2025 , by Maagulf
హైదరాబాద్ మెట్రో టికెట్ రేట్లు తగ్గాయ్..

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన ఛార్జీల్లో 10శాతం తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సవరించిన ఛార్జీలను ఎల్ అండ్ టీ మెట్రో తాజాగా ప్రకటించింది. ఈనెల 24వ తేదీ నుంచి సవరించిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. అయితే, పూర్తిగా 10శాతం తగ్గిస్తున్నట్లు చెప్పినప్పటికీ.. ఒక్కొక్క స్లాబ్ లో ఒక విధంగా తగ్గిస్తూ మెట్రో అధికారులు నిర్ణయించారు.

కొత్త ఛార్జీలు ఇలా..

  • రెండు కిలోమీటర్ల వరకు రూ.12 ఉండగా.. రూ. 11 గా నిర్ణయించారు.
  • నాలుగు కిలోమీటర్ల వరకు రూ.18  ఉండగా.. రూ.17 గా నిర్ణయించారు.
  • ఆరు కిలోమీటర్ల వరకు రూ.30 ఉండగా.. రూ.28 గా నిర్ణయించారు.
  • తొమ్మిది కిలో మీటర్ల వరకు రూ.40 ఉండగా.. రూ. 37గా నిర్ణయించారు.
  • 12 కిలోమీటర్ల వరకు రూ.50 ఉండగా.. రూ. 47 గా నిర్ణయించారు.
  • 15 కిలోమీటర్ల వరకు రూ.55  ఉండగా.. రూ.51 గా నిర్ణయించారు.
  • 18 కిలోమీటర్ల వరకు రూ.60 ఉండగా.. రూ. 56గా నిర్ణయించారు.
  • 21 కిలోమీటర్ల వరకు ప్రస్తుత ఛార్జీ రూ. 66 కాగా.. రూ.61 గా నిర్ణయించారు.
  • 24 కిలోమీటర్ల వరకు రూ.70 ఉండగా.. రూ.65 గా నిర్ణయించారు.
  • 24 కిలోమీటర్ల తర్వాత ప్రయాణం చేసే వారికి టికెట్ ధర రూ.75 ఉండగా.. రూ.6 తగ్గించి రూ.69 గా నిర్ణయించారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com