ఒలెక్ర్టా గ్రీన్టెక్ లిమిటెడ్ లాభం రూ.20.69 కోట్లు
- May 27, 2025
హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒలెక్ర్టా గ్రీన్టెక్ లిమిటెడ్ (OGL) 2023-24 ఆర్థిక సంవత్స రం నాలుగో త్రైమాసికంలో రూ.448.92 కోట్ల ఆదాయంపై రూ.20.69 కోట్ల నికరలాభం ఆర్జించింది. ముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఆదాయం 55%, లాభం 39% పెరిగాయి.ఈ త్రైమాసికంలో తాము 219 వాహనాలను డెలివరీ చేశామని, గత ఏడాది అందించిన 131 వాహనాలతో పోల్చితే ఇది 67% అధికమని కంపెనీ తెలిపింది. ఇప్పటికి మొత్తం 2,718 బస్సులను అందించినట్లు పేర్కొంది. ప్రస్తుతం తమ చేతిలో 10,022 బస్సుల సరఫరా ఆర్డర్లున్నట్టు తెలియచేసింది. మార్చి 31తో ముగిసిన ఏడాది కాలానికి ఒక్కో షేరుపై రాబడి (EPS) రూ.9.36 నుంచి రూ.16.92కి పెరిగినట్టు కంపెనీ సీఎండీ కేవీ ప్రదీప్ ప్రకటించారు. ఇదిలా ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి కంపెనీ రూ.1801.9 కోట్ల ఆదాయంపై రూ.139.21 కోట్ల నికరలాభం ఆర్జించింది.
తాజా వార్తలు
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!







