SVBC అభివృద్ధి పై సమీక్షా సమావేశం
- May 30, 2025
తిరుమల: శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్లో ప్రసారమౌతున్న కార్యక్రమాల నాణ్యత మరియు అభివృద్ధిపై శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ఈవో జె.శ్యామలరావు కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ ఎస్వీబీసీలో మరింత నాణ్యమైన కార్యక్రమాలు రూపొందించాలని తెలిపారు.శ్రీవారి భక్తులను ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలకు రూప కల్పన చేయాలని తద్వారా వీక్షకుల సంఖ్య పెంచ వచ్చునని తెలిపారు.
ఈవో మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నాణ్యమైన ప్రమాణాలతో రూపొందించడంతో పాటు యువతకు చేరువయ్యేలా కార్యక్రమాలు ప్రసారం చేయాలని తెలియజేశారు.
అంతకు మునుపు సాంకేతిక మరియు కంటెంట్ నిపుణులు శ్రీనివాసరెడ్డి,రవి కుమార్,శ్రీనివాస్ ఎస్వీబీసీ కార్యక్రమాల ప్రమాణాలను మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దేలా పలు సలహాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈఓ మరియు సీఈఓ ఎస్వీబీసీ ఇంచార్జి వీరబ్రహ్మం, ఎస్వీబీసీ ఓఎస్డీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!
- చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!
- కొత్త పార్కులు, డిజిటల్ రెసిలెన్స్ పాలసీని ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- సౌదీలో అమీర్.. ద్వైపాక్షిక పెట్టుబడుల వృద్ధిపై సమీక్ష..!!
- బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఒమన్ లో బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్టుల సీజన్..!!
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ







