దుబాయ్ లో ప్రైవేట్ పార్కింగ్ లేదా? Dh500 చెల్లించాలా?
- May 31, 2025
దుబాయ్: వచ్చే ఈద్ అల్ అధా సెలవుల నేపథ్యంలో వేసవి ప్రయాణానికి సిద్ధమవుతున్న చాలా మంది యూఏఈ నివాసితులు ప్రైవేట్ పార్కింగ్ ఫీజులకు సంబంధించి ఊహించని సమస్యలను ఎదుర్కొంటున్నారు. నిర్దేశిత భవనంలో పార్కింగ్ లేని వారు ఇప్పుడు తమ వాహనాలను సురక్షితమైన ప్రదేశంలో ఉంచడానికి నెలకు Dh500 నుండి Dh600 వరకు ఖర్చు చేస్తున్నారు. గత వేసవిలో Dh200 మాత్రమే వారు చెల్లించారు.
డీరాలోని అల్ మక్తూమ్ రోడ్‌లో నివసిస్తున్న బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ అలియా రెహ్మాన్ మాట్లాడుతూ.. తన భవనం ఒకే పార్కింగ్ స్లాట్‌ను మాత్రమే అందిస్తుందని, తన వద్ద ఉన్న రెండు కార్లకు అది సరిపోదని అన్నారు. "మేము సాధారణంగా రెండవ కారును మా భవనం సమీపంలోని పబ్లిక్ పెయిడ్ జోన్‌లో పెడతాము. ఇది జోన్ 125Cలో ఉంటుంది. మేము ఒక వారం కంటే ఎక్కువ కాలం వెళ్లాల్సి ఉన్న సమయంలో ప్రైవేట్ లాట్‌ను ఇష్టపడతాము. గతేడాది Dh200 చెల్లించగా, ఇప్పుడు Dh500 అడుతున్నారు." అని వివరించారు.
పార్కింగ్ అనేది ప్రధాన సమస్యగా మారిందని అల్ నహ్దాలో నివసిస్తున్న డ్రై ఫ్రూట్ వ్యాపారి హదీ అక్బరి తెలిపాడు. సాధారణ రోజుల్లో, నేను పబ్లిక్ పార్కింగ్ లో పెడతానని, కానీ నేను ప్రయాణించినప్పుడు ప్రైవేట్ లాట్‌లలో పార్కింగ్ చేస్తానని తెలిపాడు. ఈ సంవత్సరం నెలకు Dh600 అడుగుతున్నారని వెల్లడించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







