హీరో ఆదిత్య నిరాహార దీక్ష విరమించారు
- July 12, 2016
హీరో ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో మోడరన్ సినిమా పతాకంపై కొత్త హీరో, హీరోయిన్లతో విజయ్‌వర్మ పాకలపాటి సహనిర్మాతగా నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ 'ఫ్రెండ్ రిక్వెస్ట్'. రిలీజ్ విషయంలో ఈ చిత్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా గత నాలుగు రోజులుగా చిత్ర యూనిట్ చేస్తున్న నిరాహార దీక్షను సోమవారం విరమించారు. కొంతమంది సినీ ప్రముఖుల జోక్యంతో ఈ చిత్రానికి కొన్ని థియేటర్లు కేటాయించడం, మల్టీప్లెక్స్‌లలో మరిన్ని షోలు వేసేందుకు మార్గం సుగమం కావడంతో నిరాహార దీక్షను విరమించారు.
సోమవారం హైదరాబాద్ సిటీ మేయర్ బొంతు రామ్మోహన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా|| రాజేంద్రప్రసాద్ చిత్ర యూనిట్‌కు నిమ్మరసం తాగించి దీక్షను విరమింప జేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్స్ సెక్టార్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసొసియేషన్ ప్రెసిడెంట్ నాగరాజు, ఎమ్మెల్యే గోవర్థన్‌రెడ్డి, కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, భారత్ ఎక్తా ఆందోళన్ నేషనల్ కన్వీనర్ మల్లు రమేష్, ఇంకా పలువురు నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎంతో కష్టపడి చేసిన మా సినిమాను రిలీజ్ చేసుకోవడానికి కూడా కష్టాలు పడాల్సి వచ్చిందని దర్శకుడు ఆదిత్య ఓం తెలిపారు. థియేటర్ల విషయంలో జరిగిన అన్యాయానికి నిరసన తెలియజేస్తూ మేం ఈ నిరాహార దీక్షను చేశాం. తోటి నిర్మాతలు, దర్శకులు మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేశారు. ఇప్పుడు కొన్ని థియేటర్లలో మా సినిమా రిలీజ్ అయింది. మరికొన్ని థియేటర్లలో కూడా రిలీజ్ అవుతుంది. మేయర్ రామ్మోహన్‌గారు, రాజేంద్రప్రసాద్‌గారు ఈ సమస్యను పరిష్కరించి చిన్న సినిమాలకు న్యాయం చేస్తామని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది. మా సినిమా విషయంలో మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆదిత్య ఓం అన్నారు.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







