మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ గా మేఘా సుధా రెడ్డి
- June 01, 2025
హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీలు ఫైనల్‌కు వచ్చిన సమయంలో హైదరాబాద్‌లోని హై ప్రోఫైల్ వర్గాల్లో ఎక్కడా లేనంత సందడి కనిపిస్తోంది. ధనవంతులు, ఫ్యాషన్ ప్రియులు అంతా హైటెక్స్ లోనే కొలువుదీరారు. అందరిలోనూ ప్రత్యేకంగా మేఘా సుధారెడ్డి నిలిచారు. ఆమెను మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ గా నియమించారు. ఈ నియామకం సందర్భంగా జ్ఞాపికను మిస్ వరల్డ్ సిఈఓ జూలియా మోర్లీ అందించారు. తనను నియమించినందుకు చాలా ఆనందంగా ఉందని సుధారెడ్డి అన్నారు. అద్భుతమైన ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వానికి, టూరిజం శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.
మేఘా సుధారెడ్డికి ఫ్యాషన్ పై ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. మిస్ వరల్డ్ పోటీల విషయంలో ఆమె పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి కొన్ని కార్యక్రమాలనూ నిర్వహించారు. తన ఇంట్లో ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’ గాలా విందు కూడా ఇచ్చారు. ఈ విందుకు దేశంలోని రాజ కుటుంబాల ప్రతినిధులు హాజరయ్యారు. చాలా హై రేంజ్ లో ఈ పార్టీ జరిగింది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలకూ స్పాన్సర్ షిప్ ఇచ్చారు. అందుకే గ్లోబల్ అంబాసిడర్ గా నియమించారు.
గతంలో అమెరికాలో జరిగే మెట్ గాలా వేడుకల్లోనూ సీటు రిజర్వ్ చేసుకుని వెళ్లారు. ఆమె కోసం మేఘా కృష్ణారెడ్డి ప్రత్యేకమైన ఫ్యాషన్ కార్యక్రమాలకు స్పాన్సర్ చేస్తూంటారని ప్రచారం జరుగుతూ ఉంటుంది. మొత్తంగా మిస్ వరల్డ్ పోటీల విషయంలో మేఘా కృష్ణారెడ్డి కి ఖర్చు కాస్త ఎక్కువే అయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనకు భార్యపై ఉన్న ప్రేమ ముందు ఈ ఖర్చు తక్కువేనని కొంత మంది అంటున్నారు.
తాజా వార్తలు
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి







