దుబాయ్ లో చుక్కలనంటుతున్న ఖుర్బానీ ధరలు..!!
- June 01, 2025
యూఏఈ: ఈద్ అల్ అధా నేపథ్యంలో ఖుర్బానీ ధరలు అకాశనంటుతున్నాయి. గతేడితో పోల్చితే ఈ ఏడాది ధరలు 80శాతం వరకు పెరిగాయని పలువురు ప్రవాసులు తెలిపారు. పేమెంట్ గేట్‌వే సంస్థలో పనిచేస్తున్న భారతీయ ప్రవాసుడు, కేరళ వాసి, ఇంజనీర్ ముహమ్మద్ అజామ్ మాట్లాడుతూ.. అల్ ఖుసైస్ మార్కెట్‌లో ధరలు చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపాడు. ఈద్ అల్ అధాకు ముందు బలి ఇచ్చే జంతువుల ధరలు అంచనాలకు మించి పెరిగాయన్నాడు. 2023లో దాదాపు Dh6,000కే వచ్చిన జంతువులు ఇప్పుడు Dh10,000 దాటిందని తెలిపాడు.
మార్కెట్లో ప్రస్తుత ధరలు:
సోమాలి మేకలు (15 కిలోలు): Dh1,200 నుండి ప్రారంభం
భారతీయ మేకలు (25 కిలోలు): Dh2,800 కంటే ఎక్కువ ధర
పాకిస్తానీ మేకలు (22 కిలోలు): Dh2,500 నుండి ప్రారంభం
ఎనిమిది సంవత్సరాలుగా యూఏఈలో జంతువులను అమ్ముతున్న వ్యాపారి మొహమ్మద్ ఉస్మాన్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ధరల పెరుగుదల అధికంగా ఉందన్నాడు.వివిధ దేశాలకు చెందిన సరఫరాదారుల నుంచి తక్కువ మొత్తంలో జంతువులు వచ్చాయని, వాటికి అధిక మొత్తాన్ని డిమాండ్ చేయడంతో ఆ మేరకు మార్కెట్లో ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపాడు. మార్కెట్లో మరొక వ్యాపారి లాలా ఖాన్ మాట్లాడుతూ.. తాను పదిహేను సంవత్సరాలుగా దుబాయ్‌లో ఉన్నానని, ఇంతకు ముందు ఈ రకమైన ధర పెరుగుదలను చూడలేదని అన్నారు. "గత సంవత్సరాలలో మేము మేకలను Dh500 నుండి Dh700 వరకు విక్రయించాము. ఇప్పుడు, చిన్న సోమాలి మేక కూడా కనీసం Dh1,000 నుండి Dh1,200 వరకు ఉంటుంది. ప్రజలు కోపంగా ఉన్నారు. కానీ మాకు వేరే మార్గం లేదు" అని ఆయన అన్నారు. ఈద్ సమీపిస్తున్న కొద్దీ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున, కొనుగోలుదారులకు ముందుగానే బుక్ చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







