షార్జాలో అరుదైన అరేబియన్ మచ్చల డేగ గుడ్లగూబ పిల్లలు..!!
- June 02, 2025
యూఏఈ: కల్బా బర్డ్స్ ఆఫ్ ప్రే సెంటర్లో మూడు అరేబియన్ స్పాటెడ్ ఈగిల్ గుడ్లగూబ పిల్లలు పొదిగినట్లు షార్జా పర్యావరణ, రక్షిత ప్రాంతాల అథారిటీ ప్రకటించింది. ఈ గుడ్లగూబ జాతిని మొదటిసారిగా 2003లో యూఏఈ లో గుర్తించారు. దిబ్బా పర్వతాల్లో దొరికిన వాటిని ఒక దాత దుబాయ్ జూకు బహుమతిగా అందజేశాడు.
ఇదే కుటుంబానికి చెందిన అరేబియన్ ఈగిల్ గుడ్లగూబ (బుబో ఆఫ్రికానస్ మిలేసి) మొదటిసారిగా 2017లో ఫుజైరాలోని హజర్ పర్వతాలలో కనుగొన్నారు. టెరెస్ట్రియల్ బయోడైవర్శిటీ మేనేజర్, సైంటిఫిక్ అడ్వైజర్ జాకీ జుడాస్ మాట్లాడుతూ.. ఇక్కడి ఎడారులు, పర్వత ప్రాంతాలలో అనేక రకాల వాతావరణ పరిస్థితుల కారణంగా అనేక వినూత్నమైన జాతులు వృద్ధి చెందుతాయని అన్నారు. దురదృష్టవశాత్తు వేగవంతమైన అభివృద్ధి..ఈ జీవులలో చాలా వాటికి పెద్ద ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతరించిపోతున్న జాతులను రక్షించే ప్రయత్నాలను వేగవంతం చేసినట్టు తెలిపారు. 45 సెం.మీ ఎత్తు, 600 నుండి 800 గ్రాముల బరువున్న ఒక పెద్ద పక్షి ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







