ప్రపంచంలోనే అతిపెద్ద కూలింగ్ సిస్టమ్ ప్రారంభం..!!

- June 02, 2025 , by Maagulf
ప్రపంచంలోనే అతిపెద్ద కూలింగ్ సిస్టమ్ ప్రారంభం..!!

మక్కా: గ్రాండ్ మసీదు, ప్రవక్త మసీదు వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ 1446 హజ్ సీజన్ కోసం సన్నాహాల్లో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద కూలింగ్ వ్యవస్థను ప్రారంభించింది. ఈ వ్యవస్థ మొత్తం 155,000 టన్నుల కూలింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. గ్రాండ్ మసీదు ఎయిర్ కండిషనింగ్ మౌలిక సదుపాయాలు రెండు ప్రధాన స్టేషన్లపై ఆధారపడి ఉంటాయి. 120,000 టన్నుల సామర్థ్యం కలిగిన అల్-షామియా స్టేషన్, 35,000 టన్నుల సామర్థ్యం కలిగిన అజ్యాద్ స్టేషన్. ఈ స్టేషన్లు అన్ని విస్తరణ ప్రాంతాలతో సహా మొత్తం మసీదు సముదాయాన్ని కవర్ చేస్తాయి.యాత్రికులకు 22°C నుండి 24°C వరకు మితమైన, సౌకర్యవంతమైన ఉష్ణోగ్రతలను అందిస్తాయి. సరైన గాలి నాణ్యతను నిర్వహించడానికి వీలుగా.. ఈ వ్యవస్థ 95% గాలి మలినాలను తొలగించగల అధునాతన శుద్దీకరణ సాంకేతికతలను కలిగి ఉందని అధికారులు తెలిపారు. ఇది యాత్రికులకు.. ముఖ్యంగా వేసవి వేడి సమయంలో శుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందజేస్తుందని పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com