ఒమన్‌లో ఔట్ డోర్ వర్క్ పై ఆంక్షలు ప్రారంభం..!!
- June 02, 2025
మస్కట్: వేసవి వేడి నుండి కార్మికులను రక్షించే చర్యలో భాగంగా, ఒమన్ అంతటా నిర్మాణ ప్రదేశాలు, ఇతర బహిరంగ పని ప్రదేశాలలో మధ్యాహ్నం పని నిషేధాన్ని కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) అధికారికంగా అమలు చేసింది. అధిక ఉష్ణోగ్రతలకు గురయ్యే ప్రాంతాల్లో కార్మికులు మధ్యాహ్నం 12:30 నుండి 3:30 గంటల మధ్య పని చేయడాన్ని నిషేధించారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45°C కంటే ఎక్కువగా పెరుగుతున్నందున కార్మికుల ఆరోగ్యం, భద్రతను కాపాడటం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఉల్లంఘించే కంపెనీలు OMR 500 నుండి OMR 1,000 వరకు జరిమానాలను ఎదుర్కొంటాయని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. నిబంధనల మేరకు నిర్మాణ కంపెనీలు షెడ్యూల్‌లను సర్దుబాటు చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్‌ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!







