బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో కోసం ఒప్పందాలు
- July 12, 2016
2018 బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో పాల్గొనే కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి బహ్రెయిన్ సమాయత్తమవుతోంది. దీనికోసం బహ్రెయిన్ డెలిగేషన్, యునైటెడ్ కింగ్‌డమ్‌లో పర్యటించనుంది. ఫరన్‌బరోహ్ ఎయిర్ షోలో పాల్గొని, అక్కడే వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనంది బహ్రెయిన్ డెలిగేషన్ టీమ్. ఇప్పటికే బహ్రెయిన్ ఎయిర్ షోలో పాల్గొనేందుకు ఆసక్తితో ఉన్న 12 కంపెనీలు డెలిగేషన్ టీమ్‌తో సమావేశమయ్యే అవకాశం ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ టెలికమ్యూనికేషన్స్, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, గల్ఫ్ ఎయిర్ సంస్థలకు చెందిన సీనియర్ అధికారుల బృందం ఈ డెలిగేషన్‌లో ఉంది. 1 బిలియన్ విలువైన కాంట్రాక్టులు ఈ సందర్భంగా సైన్ చేసే అవకాశం ఉంది. బీఏఈ సిస్టమ్స్, ఖతార్ ఎయిర్ వేస్, రోల్స్ రాయిస్, డిహెచ్‌ఎల్, సెర్కో, బోయింగ్, కల్‌మాన్, లాక్‌హెడ్ మార్టిన్, కార్గో చార్టర్ ఆపరేటర్ టెక్సెల్ ఎయిర్ వంటివి ఈ సందర్భంగా బిఐఎస్ 2018లో పాల్గొనేందుకు ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో 2018, నవంబర్ 14 నుంచి 16 వరకు జరగనుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







