దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో చీపర్ పార్కింగ్
- July 12, 2016
దుబాయ్ ఎయిర్పోర్ట్ పార్కింగ్‌లో లాంగ్ టెర్మ్ పార్కింగ్ కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అయితే కొన్ని చీపర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చాలామందికి ఈ విషయం తెలియదు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న నాలుగు హోటల్స్‌లో రెండు హోటల్స్ తక్కువ ధరకే ఎయిర్పోర్ట్ టెర్మినల్స్‌లో పార్కింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ 1 మరియు 2 లో ఒక రోజుకి 100 దిర్హామ్‌లు కాగా, టెర్మినల్ 3లో ఇది 240 దిర్హామ్‌లుగా ఉందని ఎయిర్పోర్ట్ వెబ్సైట్ పేర్కొంటోంది. లె మెరెడియన్ దుబాయ్ హోటల్ మరియు కాన్ఫరెన్స్ సెంటర్ కాంప్లెక్స్ పబ్లిక్ రిలేషన్స్ మరియు కమ్యూనికేషన్స్ మేనేజర్ దేవీకా నిజవాన్ మాట్లాడుతూ, ఎక్కువమంది సమ్మర్ హాలీడేస్ కోసం విదేశాలకు లాంగ్ ట్రిప్ వెళుతుంటారనీ, అలాంటివారికి పార్కింగ్ చాలా భారమవుతుందని అందుకే తాము తక్కువ ధరకే పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కస్టమర్లు కానివారు రెండు వారాలపాటు కారుని పార్కింగ్ చేసుకోడానికి 250 దిర్హామ్‌లు వసూలు చేస్తామనీ, 350 దిర్హామ్‌లతో మూడు వారాలపాటు, 450 దిర్హామ్‌లతో 4 వారాలపాటు తమ కార్లను పార్కింగ్ చేసుకోవచ్చని హోటల్ నుంచి ఎయిర్పోర్ట్ టెర్మినల్స్‌కి రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఎయిర్ పోర్ట్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రీమియర్ ఇన్ హోటల్, రోజుకి 50 దిర్హామ్‌ల ఖర్చుతో వాహనాల పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







